Delta Variant In Us : అమెరికాలో డెల్టా వేరియంట్ ..83 శాతం పెరుగుదల

అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మరోసారి పంజా విసురుతోంది.డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జులై మొదటి వారంలో ఈ కేసులు భారీగా పెరిగి 83 శాతంగా ఉన్నాయని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది.

Delta Variant In Us : అమెరికాలో డెల్టా వేరియంట్ ..83 శాతం పెరుగుదల

Us Corona Ceses

Updated On : July 21, 2021 / 2:46 PM IST

Delta variant In Us : అమెరికాపై మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. డెల్టా వేరియంట్ విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్ వైరస్ వల్ల కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. వారం రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. జులై మొదటివారం నుంచి 50 శాతం పెరిగాయి. కొత్త కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డిసీజెస్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) నిర్ధారించింది. ఈ వేరియంట్ వల్ల 83 శాతం మేర కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది.

వారంరోజుల్లోనే ఈ కేసులు భారీగా పెరిగిపోయాయని వెల్లడించింది. ఈ కేసులకు సంబంధించి ఓ నివేదికను కోవిడ్ సెనెట్ కమిటీకి అందజేసింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచివుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల క్రమంలో అమెరికాలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరటంతో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు అమెరికా అల్లాడిపోయింది. తీవ్రంగా ప్రాణనష్టం కూడా కలిగింది.

డెల్టా వేరియంట్ వల్లే.. కొద్దిరోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం కలవరానికి గురిచేస్తోంది. దీనికి కారణం- డెల్టా వేరియంటేనని సీడీసీ డైరెక్టర్ రెఛెల్లె వెల్సింకీ తెలిపారు. సెనెట్ కమిటీకి అందజేసిన నివేదికలో కీలక విషయాలను ఆమె ప్రస్తావించారు. అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త కేసులు అధికంగా నమోదవుతోన్నాయని..అర్కాన్సస్, ఫ్లోరిడా, మిస్సౌరీల్లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా ఉందని తెలిపారు. వాటితో పాటు అలబామా, జార్జియా, లూసియానా, మిస్సిస్సిపి, టెన్నెస్సె, టెక్సాస్‌లల్లో ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.

3వ తేదీ నుంచి రెట్టింపు.. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అనుసరిస్తోన్న కరోనా నివారణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కరోనా మరణాలు కూడా 48 శాతం పెరిగాయని అన్నారు. జులై 3వ తేదీ నుంచి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో అనూహ్యమైన పెరుగుదల ఉందని.. ఇది అంచనాలకు అందట్లేదని వెల్సింకీ అన్నారు. ఇంకా దేశ జనాభాలో సగం మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. గత కొన్ని వారాలుగా టీకాల కార్యక్రమం మందగించింది. ప్రతీ రోజు 5,21,000 డోసులు వేస్తోంది. ఇది గత నెలలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. పైగా యూఎస్ వాసులు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇప్పటికీ ఆసక్తి చూపించకపోవటం గమనించాల్సిన విషయం. ఫలితంగా కేసులు భారీగా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇటువంటి పరిస్థితే కొనసాగితే..ఫోర్త్‌వేవ్‌కు కూడా దారి తీయొచ్చని మిస్సిస్సిపీ స్టేట్ హెల్త్ ఆఫీసర్ థామస్ డాబ్స్ హెచ్చరించారు. తక్షణమే కరోనా వైరస్ వ్యాప్తి చెందే పరిస్థితులను నివారించడానికి చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని..లేదంటే మరోసారి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.