Dasoju Sravan joins BJP: ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తదితర నేతలు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి దాసోజు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళారు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు.

Dasoju Sravan joins BJP
Dasoju Sravan joins BJP: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ సమక్షంలో ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాసోజుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నేత వివేక్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి దాసోజు రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళారు. అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ పదవులకు దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు.
దాసోజుతో కొన్ని రోజుల పాటు బీజేపీ తెలంగాణ నేతలు సంప్రదింపులు జరిపి, చివరకు తమ పార్టీలో చేర్చుకున్నారు. శ్రవణ్‌ను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్ళి సీనియర్ నేతలు కోదండరెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ ఇటీవల చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బీజేపీలో కొన్ని రోజుల్లో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు చేరనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న చేరతారని ఇప్పటికే బండి సంజయ్ ప్రకటించారు.
మునుగోడులో జరిగే సభకు కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించారు. ఈ నెల21నే కొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ బీజేపీలో చేరికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరించారు.