Sukumar: పుష్ప-2 కోసం భారీగా పెంచేసిన సుక్కు..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా..

Pushpa 2
Sukumar: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిపో్యాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ టేకింగ్‌తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఒక సింపుల్ కథను తీసుకుని తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెరకెక్కించి, ఆడియెన్స్ పల్స్‌ను పట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఈ డైరెక్టర్.
Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!
పుష్ప చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించినా, పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లోనూ దుమ్ములేపే రిజల్ట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప – ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు సుకుమార్. అయితే ఈ సీక్వెల్ చిత్రం కోసం సుకుమార్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Sukumar : వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్
పుష్ప తొలిభాగం అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టడంతో, సీక్వెల్‌పై మరింత కసరత్తు చేస్తున్నాడట ఈ డైరెక్టర్. అందుకే ఈసారి సినిమాకు బడ్జెట్‌ను కూడా పెంచేందుకు సిద్ధమవుతున్నారట చిత్ర యూనిట్. పనిలో పనిగా తమ రెమ్యునరేషన్ కూడా పెంచేసి మరోసారి అదిరిపోయే సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని సుకుమార్ అండ్ టీమ్ చూస్తున్నారట. మరి పుష్ప 2 చిత్రంతో సుకుమార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.