Telangana : తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి

Corona in Telangana
Telangana : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,913 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ఇదే సమయంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఈ రోజు కరోనా నుంచి 232 మంది బాధితులు కోలుకున్నట్లు పేర్కొంది.
చదవండి : AP and Telangana: ఆంధ్ర – తెలంగాణ వివాదాలపై కేంద్ర హోం శాఖ సమావేశం
కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,87,456కు చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని 6,75,573 మంది ఇళ్లకు వెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ మహమ్మారితో 4,036 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.27గా ఉందని వివరించారు అధికారులు
చదవండి : Corona Cases Telangana : తెలంగాణలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. 5 రోజుల్లోనే 5 రెట్లు పెరిగిన కేసులు