కరోనావైరస్ ఇప్పుడు తగ్గినా.. ప్రపంచానికి మరో ప్రమాదముంది: WHO

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 06:55 AM IST
కరోనావైరస్ ఇప్పుడు తగ్గినా.. ప్రపంచానికి మరో ప్రమాదముంది:  WHO

Updated On : October 31, 2020 / 2:59 PM IST

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో.. మూడో దశకు రెడీగా ఉండాలని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరిస్తుంది. మహమ్మారి ప్రభావం యూరప్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ కేసులు నమోదు కావడంలో అది పీక్స్ లో ఉందని WHO హెడ్ డా.హన్స్ క్లాగ్ అన్నారు. COVID-19 మనల్ని వదిలి అంత త్వరగా పోయే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. 

యూకేలో ప్రస్తుతం తయారైన కొవిడ్ 19 వ్యాక్సిన్ ట్రయల్స్ లో ఉంది. ఫార్మాసూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో పాటుగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భారీ మొత్తంలో దీనిని తయారుచేస్తున్నారు. దీనిపై WHO హెడ్ మాట్లాడుతూ.. ‘పలు దేశాల్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. రాజకీయ నాయకులంతా ఆరోగ్యం కాపాడేందుకే పాటుపడుతున్నారు. ఎకానమీని నడిపించేది ఆరోగ్యమే. అది లేకుంటే జరిగేది కూడా చూస్తున్నాం. ఆరోగ్యం దూరమైతే జాతి భద్రత కూడా ఉండదు’.(కరోనాకు రెమెడెసివర్ కరెక్ట్ మెడిసిన్ అంటోన్న గిలీద్.)

‘ఈ మహమ్మారి నుంచి ఒక్కసారి దూరమైతే ఈ పాఠం మనకెప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. యూకే లాక్‌డౌన్‌ను ఇంకా పాటిస్తుంది. 26వేల 771మంది హాస్పిటళ్లలో, కేర్ హోమ్స్‌లో మరణించారు. యూరప్ కాకుండా ఇతర దేశాలు నియమాలను సడలిస్తూ.. షాపులు రీ ఓపెన్ చేస్తూ ప్రజలను బయటతిరిగేందుకు కొద్దిపాటి అనుమతులు ఇస్తుంది. 

డా. క్లాగ్ మాట్లాడుతూ.. భవిష్యత్ లోనూ ఇలాంటి ప్రమాదాలు రావొచ్చని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. రెండో దశ, మూడో దశ కూడా రావొచ్చు. సరైన వ్యాక్సిన్ కనిపెట్టకపోతే అది తప్పదు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మెలగాలి. వేసవిలోనూ ఏ మాత్రం ఉపశమనం ఉండదు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమాజంలో ఉన్నవారంతా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని డా.క్లాగ్ అన్నారు.