ప్రియుడిపై కేసు పెట్టిన ‘శ్రీమంతుడు’ ఫేమ్ సనమ్ శెట్టి..

  • Published By: sekhar ,Published On : October 6, 2020 / 01:12 PM IST
ప్రియుడిపై కేసు పెట్టిన ‘శ్రీమంతుడు’ ఫేమ్ సనమ్ శెట్టి..

Updated On : October 6, 2020 / 4:14 PM IST

Actress Sanam Shetty: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ పాపులర్ యాక్ట్రెస్ సనమ్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నై అడయార్‌ శాస్త్రి భవన్‌ ప్రాంతానికి చెందిన సనమ్‌ శెట్టి మోడలింగ్ చేస్తూనే.. తమిళ, తెలుగు(శ్రీమంతుడు), కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించింది.


తమిళ్ బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలేషియా యువకుడు దర్శన్‌కు సనమ్‌ శెట్టితో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. కొంతకాలం ఇద్దరూ మరో ప్రపంచంలో విహరించారు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.


కట్ చేస్తే.. దర్శన్‌ తనను ప్రేమించి మోస గించాడంటూ సనమ్ అడయార్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్‌ ఆచూకీ కోసం గాలిస్తు న్నారు. త్వరలో పెళ్ళి చేసుకుంటానని ప్రామిస్‌ చేసిన దర్శన్‌ ప్రస్తుతం తనతో మాట్లాడటమే లేదని, తనను పెళ్ళి చేసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నాడని సనమ్‌ శెట్టి ఫిర్యాదులో పేర్కొంది.