Allu Aravind: అంతకంటే ఓ తండ్రికి ఏం కావాలి.. బన్నీపై అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతాయో అందరికీ తెలిసిందే.

Allu Aravind: అంతకంటే ఓ తండ్రికి ఏం కావాలి.. బన్నీపై అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్!

Updated On : February 21, 2023 / 3:40 PM IST

Allu Aravind: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతాయో అందరికీ తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి ఓ సినిమా వస్తుందంటే, ఆ సినిమాలో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అంతలా ఈ బ్యానర్ నుండి వచ్చే సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంటుంది.

Allu Aravind : బన్నీ భార్య పై అల్లు అరవింద్ కామెంట్స్.. కోడలు గురించి ఏమి మాట్లాడాడో తెలుసా?

ఇక ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇటీవల వరుసగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ సందడి చేస్తు్న్నారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్, తన కొడుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో తనను చూసి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారని.. కానీ, ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని గుర్తిస్తున్నారంటూ అరవింద్ పేర్కొన్నారు.

Allu Aravind : ఆహాని నిలబెట్టింది సుహాస్.. అల్లు అరవింద్!

ఒక తండ్రికి ఇంతకన్నా ఏం గుర్తింపు కావాలని అల్లు అరవింద్ గర్వంగా చెబుతున్నారు. తన కొడుకును ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని.. ఓ ఆర్టిస్టుకి ఇంతకంటే ఏం కావాలని ఆయన అన్నారు. ఇక బన్నీ పుష్ప-2 సినిమాతో తన స్థాయిని మరింతగా పెంచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.