Unstoppable – Pushpa : ‘పుష్ప’ సినిమాలాగే బాలయ్యతో ఇంటర్వ్యూ కూడా రెండు పార్టులు.. సెకండ్ పార్ట్‌లో వాళ్ళు వస్తారా?
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అల్లు అర్జున్, అల్లు అర్జున్ తల్లి నిర్మల వచ్చారు.

Allu Arjun Balakrishna Aha Unstoppable Content Planned in Two Episodes for Pushpa 2 Promotions
Unstoppable – Pushpa : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ రాగా ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. నాలుగో ఎపిసోడ్ లో అల్లు అర్జున్ వచ్చి సందడి చేసాడు. గతంలో పుష్ప సినిమా ప్రమోషన్స్ సమయంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక, సుకుమార్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు మళ్ళీ పుష్ప 2 ప్రమోషన్స్ కి వచ్చారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అల్లు అర్జున్, అల్లు అర్జున్ తల్లి నిర్మల వచ్చారు. అయితే ఈ ప్రోమో చివర్లో పార్ట్ 1 నవంబర్ 15న ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుంది అని చెప్పారు. దీంతో ఈ ఇంటర్వ్యూ కి పార్ట్ 2 కూడా ఉందని తెలుస్తుంది. అది పై వచ్చే వారం వస్తుందేమో చూడాలి. పుష్ప సినిమాను 2 పార్టులుగా తీసినట్టు బాలయ్యతో ఇంటర్వ్యూ కూడా రెండు పార్టులుగా ప్లాన్ చేసారు.
Also Read : Allu Arjun Mother : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ తల్లి కూడా.. బన్నీ గురించి ఏం చెప్పింది..?
ప్రోమో చూపించిన విధానం ప్రకారం పార్ట్ 1లో అల్లు అర్జున్ గురించి, అతని అభిరుచులు గురించి, నేషనల్ అవార్డు, సరదా ప్రశ్నలు, అల్లు అర్జున్ తల్లి గురించి ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇక పార్ట్ 2లో గతంలో లాగా రష్మిక, సుకుమార్ వచ్చి పుష్ప 2 సినిమా గురించి మాట్లాడతారు అని తెలుస్తుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదేలే బాలయ్యతో పుష్ప రెండు ఎపిసోడ్స్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్స్ లో ఎన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
https://www.youtube.com/watch?v=ErXaguVHXGE