Anchor Rashmi : చేతబడి చేయిస్తా.. యాసిడ్ పోస్తా అంటూ యాంకర్ రష్మీకి బెదిరింపులు..

కొంతమంది సెలబ్రిటీలని సోషల్ మీడియాలో కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం పోస్టులు పెట్టినా లేకపోతే వాళ్లకు ఆ పోస్టులు నచ్చకపోయినా దారుణంగా ట్రోల్ కూడా చేస్తారు. ఇక రష్మికి కూడా ఇలాగే అప్పుడప్పుడు బెదిరింపులు, ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఓ నెటిజన్ రష్మీని బెదిరిస్తూ సోషల్ మీడియాలో.............

Anchor Rashmi : చేతబడి చేయిస్తా.. యాసిడ్ పోస్తా అంటూ యాంకర్ రష్మీకి బెదిరింపులు..

Anchor Rashmi getting warning messages and she posted it on social media

Updated On : February 26, 2023 / 12:43 PM IST

Anchor Rashmi :  స్టార్ యాంకర్ గా, నటిగా రష్మీ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. పలు టీవీ షోలు, సినిమాలతో రష్మీ బిజీబిజీగా షూటింగ్స్ లో ఉంటుంది. సినిమాలు, షోలతో ఎంత బిజీ ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పెట్టడమే కాకుండా మూగ జంతువులపై ప్రేమను చూపిస్తూ, వాటికి ఉన్న కష్టాలని పోస్ట్ చేస్తూ, తనకి తోచిన సాయం చేస్తూ, తన అభిమానులని కూడా సాయం చేయమంటూ పోస్టులు పెడుతుంది.

కొంతమంది సెలబ్రిటీలని సోషల్ మీడియాలో కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం పోస్టులు పెట్టినా లేకపోతే వాళ్లకు ఆ పోస్టులు నచ్చకపోయినా దారుణంగా ట్రోల్ కూడా చేస్తారు. ఇక రష్మికి కూడా ఇలాగే అప్పుడప్పుడు బెదిరింపులు, ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఓ నెటిజన్ రష్మీని బెదిరిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ చేయడంతో రష్మీ దానిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది.

Ram Charan-NTR : నా బ్రదర్ ఎన్టీఆర్, నేను కలిసి వాళ్ళతో పోటీ పడుతున్నాము.. చరణ్ ట్వీట్..

ఆ నెటిజన్ రష్మీకి.. నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయా, నీ మీద యాసిడ్ పోస్తా, వాటి గురించి నీ లాంటి పాపిష్టి వాళ్లకు తెలియదు. అన్ని మూసుకొని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాలలో పడతావు అంటూ ఇష్టమొచ్చినట్టు మెసేజ్ చేశాడు. ఇదే నెటిజన్ గతంలో రష్మిక పెళ్లి, వయసు గురించి కూడా కామెంట్ చేస్తూ మెసేజ్ చేశాడు. దీంతో ఈ మెసేజ్ ని రష్మీ స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ఈ అకౌంట్ అతనికి ఒకప్పుడు నా పెళ్లి, వయసుతో ఇబ్బంది ఉండేది. ఇప్పుడేమో నాకు చేతబడి చేయిస్తా, యాసిడ్ పోస్తా అంటూ బెదిరిస్తున్నాడు. ఇతని మీద ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వొచ్చా అని ట్వీట్ చేసింది. దీంతో చాలా మంది రష్మీకి మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు, అతని మీద సైబర్ పోలీస్ కంప్లైంట్ ఇమ్మని కామెంట్స్ చేస్తున్నారు.