Bigg Boss 7 : స్పైసీ చికెన్ టాస్క్.. మంట తట్టుకోలేక ఏడ్చేసిన శోభాశెట్టి
బిగ్‌బాస్ హౌజ్‌లో మూడో పవర్ అస్త్ర కోసం పోటీలు జరుగుతున్నాయి. ఈ పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు కంటెండర్లుగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను బిగ్‌బాస్ సెలక్ట్ చేయగా మిగిలిన వారు తిరస్కరించారు.

Bigg Boss 7
Bigg Boss 7 Day 18 Promo : బిగ్‌బాస్ (Bigg Boss) హౌజ్‌లో మూడో పవర్ అస్త్ర కోసం పోటీలు జరుగుతున్నాయి. ఈ పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు కంటెండర్లుగా అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను బిగ్‌బాస్ సెలక్ట్ చేయగా మిగిలిన వారు తిరస్కరించారు. దీంతో ఈ ముగ్గురు కంటెండర్లుగా తమ ఎంపిక సరైందే అని నిరూపించుకోవాలని బిగ్‌బాస్ సూచించాడు. మొదటగా ప్రిన్స్ యావర్ కు టాస్క్ ఇచ్చాడు. దామిని, రతిక, టేస్టీ తేజలు ఎన్ని రకాలు ప్రయత్నించినప్పటికీ తనని తాను అర్హుడనని ప్రిన్స్ నిరూపించుకున్నాడు.
ఇప్పుడు శోభాశెట్టి (Shobha Shetty) వంతు వచ్చింది. ఆమెను కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. అత్యంత కారంగా ఉన్న చికెన్ తినమని చెప్పాడు. మీలో ఉన్న గెలవాలనే ఆకలిని ఈ చికెన్‌ను తిని నిరూపించుకోవాలని సూచించాడు. శోభా ఆ చికెన్ ను తినేందుకు చాలా ప్రయత్నం చేసింది. అయితే.. తన లైఫ్‌లో ఇంత కారం ఎప్పుడూ తినలేదంటూ చెప్పింది. కాగా.. మీరు ఎంత ఎక్కువ కారం తింటే అది మీ ప్రత్యర్థులను బీట్ చేసేందుకు ఇచ్చే బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని మరోసారి బిగ్‌బాస్ తెలిపాడు.
కొన్నిముక్కలు తినేసరికి శోభా శెట్టికి మంట ఎక్కువైంది. ఆ మంట తట్టుకోలేక ఏడ్చేసింది. ఆ తరువాత శోభాశెట్టి అనర్హురాలు అని చెప్పిన శుభ శ్రీ, ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ముందు కారం ఉన్న చికెన్ పెట్టాడు బిగ్‌బాస్. ముగ్గురిలో ఎవరు ముందుగా తింటే వాళ్లు ఈ పోటీలో విజేతగా నిలిచి శోభా ప్లేస్‌లో కంటెండర్‌గా ఉంటారని అన్నాడు. మరీ ఈ పోటీలో ఎవరు విజేతగా నిలిచారు.? లేకుంటే కంటెండర్‌గా శోభానే కొనసాగనుందా అన్నది తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Salaar : ప్రభాస్ అభిమానులకు గట్టి షాక్.. 2023లో సలార్ రావడం లేదట..