Nani: డైరెక్టర్ నో అన్నాడని వీడియో లీక్ చేసిన నాని.. నెట్టింట వైరల్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో నాని పూర్తి ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దసరా కానుకగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించగా, ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు.

Dasara First Single Promo Leaked By Nani
Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో నాని పూర్తి ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.
Nani: దసరా రోజున ధూంధాం దోస్తాన్ అంటోన్న నాని!
దసరా కానుకగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించగా, ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేస్తారని అందరూ ఆశించారు. కానీ.. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సాంగ్ ప్రోమోకు నో చెప్పాడట. దీంతో నాని తన అభిమానుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ను వదిలాడు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఓ వీడియోను నాని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
Dasara: పండగకు రెండు రోజుల ముందే దసరా చేస్తోన్న నాని!
ఈ సాంగ్‌తో దుమ్ము లేశిపోద్ది అని నాని కామెంట్ చేయడంతో ఈ పాట ఏ రేంజ్‌లో ఊరమాస్ సాంగ్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమా వస్తుండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
Since @odela_srikanth says no promo. Leaking something I recorded in my phone while we filmed the song 🙂
రేపటి సంది దుమ్ము లేశిపోద్ది pic.twitter.com/OQeevCqdD1
— Nani (@NameisNani) October 2, 2022