Tollywood : ఐటీ వాళ్లకు టాలీవుడ్ టార్గెట్ గా మారిందా? కలెక్షన్స్ కారణమా? గొప్పలకు పోతున్న సినీ హీరోలు, నిర్మాతలు..?
ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది.

IT Department Focus on Tollywood Due to Heavy Collections Rumors Goes Viral
Tollywood : సక్సెస్‌కు కేరాఫ్‌గా మారుతోంది టాలీవుడ్. గత ఐదారేళ్లుగా ప్రపంచంలో ఏ మూలకెళ్లినా తెలుగు సినిమాపైనే చర్చ జరుగుతోంది. ఆస్కార్ వేదిక మీద మెరిసిన తెలుగు మూవీ దునియా దృష్టిని ఆకర్షించింది. దేశంలో ఏ సినీ పరిశ్రమకు లేనన్ని విజయాలు టాలీవుడ్ సొంతం అవుతూ వస్తున్నాయి. బాహుబలి నుంచి మొదలైన తెలుగోడి దండయాత్ర లేటెస్ట్‌గా పుష్ప-2 వరకు కొనసాగుతూ వస్తోంది. అయితే భారీ బడ్జెట్ సినిమాలు దానికి మించి కలెక్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా మారిమోగిపోతున్న తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రచారానికి తగ్గట్లే ఐటీకి టార్గెట్ అయిందన్న టాక్ వినిపిస్తోంది.
బాహుబలి, బాహుబలి 2 కలిసి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. తర్వాత RRR 1300 కోట్లు వసూలు రాబట్టినట్లు టాక్ నడిచింది. కల్కి, యానిమల్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా సలార్ 700 కోట్ల వరకు వసూలు చేసినట్లు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అయ్యాయని చెప్పారు. పుష్ప-1, పుష్ప-2 కలెక్షన్స్ రెండు కలిపి రెండు వేల కోట్లు దాటినట్లు మోత మోగిస్తున్నారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రావడం అంతేస్థాయిలో కలెక్షన్స్ వస్తున్నట్లు జాతీయ స్థాయిలోనూ ప్రచారం జరుగుతుండటంతో ఐటీ కన్ను టాలీవుడ్ మీద పడినట్లు కనిపిస్తోంది.
ఉన్నట్లుండి టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో వరుస పెట్టి ఐటీ రైడ్స్ జరగడం హాట్ టాపిక్ అవుతోంది. సినీ ప్రొడ్యూసర్ల ఇళ్లలో ఇన్‌కమ్ ట్యాక్స్ తనిఖీలు కామన్ అని చెప్తున్నా వరుస పెట్టి మూడు నాలుగు రోజులుగా నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరగడం వెనుక సక్సెసే కారణమా? లేక ఎచ్చులకు పోయి ఇరుక్కుపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది.
టాలీవుడ్‌లో కొన్ని వందల కోట్లు పెట్టి తీసిన సినిమా వెయ్యి కోట్లు దాటి కలెక్షన్లు చేస్తుందట. కొన్ని సినిమాలకు మేకింగ్ బడ్జెట్ ఎక్కువ చెప్పి వసూళ్లను తక్కువ చూపిస్తున్నారట. మరికొన్ని సినిమాలకు పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్‌కు వస్తున్న రాబడికి చాలా తేడా ఉంటుందట. ఐటీ రైడ్స్‌లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బయట జరుగుతోన్న ప్రచారానికి సినీ నిర్మాతలు చూపిస్తున్న లెక్కలకు అసలు పొంతనే లేదట. ఒక్కోసారి రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చినా తక్కువ చూపించి ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని అనుమానిస్తున్నారు ఐటీ ఆఫీసర్లు.
టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థలుగా పేరున్న రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్‌లపై వరుసపెట్టి రైడ్స్ జరగడం చర్చకు దారి తీసింది. సక్సెస్‌కు కేరాఫ్‌గా ఉండి ఈ ఐదారేళ్లలో పదేసి సినిమాలు నిర్మించి ఐదారు మూవీస్‌తో బాక్సాఫీస్‌ను బద్దలు చేసిన నిర్మాణ సంస్థల లెక్కలపై ఆరా తీయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మూవీ మేకర్స్‌కు పైనాన్స్ చేస్తున్న వాళ్ల ఇళ్లల్లో కూడా తనిఖీలు చేయడం చేస్తుంటే టాలీవుడ్ ఐటీకి గట్టిగానే టార్గెట్ అయిపోయిందన్న టాక్ వినిపిస్తోంది.
తెలుగు మూవీస్‌గా పాన్ ఇండియా లెవల్‌లో హిట్ అయిన మూవీస్ అన్ని భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి. బాలీవుడ్ మూవీస్‌ను మించి మన సినిమాలు హిట్ అవుతున్నాయి. అయితే ఓ కాయిన్‌కు టూ సైడ్స్ ఉన్నట్లే ఐటీ రైడ్స్‌లో పలు విషయాలు బయటికి వస్తున్నాయట. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ ఫుల్ వచ్చినా వసూళ్లు నిల్ అని చూపిస్తున్నారట. బయట ప్రచారం వేల కోట్లలో ఉంటే కాగితాల మీద మాత్రం వందల కోట్లు కూడా చూపించడం లేదట. ఫైనల్‌గా ప్రాఫిట్ అన్నదే లేదన్నట్లుగా కొన్ని సినిమాలకు అయితే బ్రేక్ ఈవెన్‌లో పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చిందని చెప్తున్నారట. ఇంకొన్ని సినిమా కలెక్షన్స్ వివరాలు చూస్తే ఐటీ అధికారులే అవాక్కయారట.
వెయ్యి కోట్లు, 500 కోట్ల వసూళ్లు అంటూ బయట ప్రచారం జరిగితే తీరా లెక్కలు చూస్తే మాత్రం చాలా తేడా కనిపిస్తున్నాయట. సినిమా వసూళ్లపై ప్రచారం పీక్స్‌లో ఉంటే ఆదాయం మాత్రం తక్కువ చేసి చూపుతున్నారట. వచ్చే కలెక్షన్స్ కంటే ఊదరగొట్టడమే ఎక్కువగా ఉందట. చారాణ కలెక్ట్ చేస్తే చెప్పుకునేది బారాణ అన్నట్లుగా ఉండటం కూడా తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. పట్టుమని పది కోట్లు రాని సినిమాకు కూడా కలెక్షన్ల విషయంలో కొన్నిసార్లు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందంటున్నారు.
లేటెస్ట్‌గా జరుగుతున్న ఐటీ రైడ్స్ అయితే ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తెలుగు సినిమాలు వరుస హిట్స్ కొట్టి వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం వల్లే ఐటీ కన్ను పడిందా? లేక టాలీవుడ్ సెల్ఫ్‌గోలే ఇరకాటంలో పడేస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. చారాణా కోడికి బారాణ మసాలా అన్నట్లు వచ్చేది పావులా అయితే రూపాయి సంపాదించినట్లు చెప్పుకోవడమే కొంపముంచుతోందా అనేది చర్చనీయాంశం అవుతోంది. ఏది ఏమైనా టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళలో ఐటీ రైడ్స్ జరగడం మాత్రం టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది.
కలెక్షన్సే సక్సెస్‌కు ప్రయారిటీ. సినిమా హిట్, ఫ్లాప్‌కు ఇదే అతిపెద్ద గీటురాయి అయిపోయింది. పెట్టిన పెట్టుబడి వచ్చినా సక్సెన్ కానట్లే. రూపాయి పెడితే పది రూపాయలు వస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందన్న టాక్ వచ్చే పరిస్థితి. దీంతో కలెక్షన్ల రేసులో పరిగెడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు. అతిపెద్ద నిర్మాణ సంస్థలుగా భారీ బడ్జెట్ మూవీలు తీసిన ప్రొడక్షన్ హౌస్‌లుగా నిలవాలనేది నిర్మాతల ప్లాన్. ఇక తన సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయనే రికార్డు కోసం స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్‌కు ముందే ప్రీరిలీజ్ బిజినెసే వందల కోట్ల రూపాయల్లో ఉన్నట్లు చూపిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క రోజే వంద కోట్లు అని సెకండ్ డే 200 కోట్లని, వన్ వీక్‌లోనే ఇంకో పెద్ద సినిమా రికార్డును దాటిపోయిందంటూ లెక్కలకు హద్దే లేకుండా పోయింది. నిజంగా అలా కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమానే తెలుగు సినిమాతో పోటీ పడితే అంత కంటే హ్యాపీ ఇంకోటి లేదు. కానీ రీల్ సీన్‌కు రియల్ లైఫ్‌కు చాలా తేడా ఉన్నట్లే సినిమా కలెక్షన్స్ విషయంలో పెద్ద ఇలఖత మాఫియా నడుస్తుందట.
సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాల కలెక్షన్స్ చూస్తే వావ్ అనాల్సిందే. గేమ్‌ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందన్న టాక్ వచ్చినప్పటికీ మూడు వందల కోట్లు కలెక్ట్ చేసినట్లు ఓ ప్రచారం జరుగుతోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆరురోజుల్లో వంద కోట్లు షేర్ కలెక్ట్ చేసిందని, నార్త్ అమెరికాలో 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టిందని మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
వరల్డ్ వైడ్‌గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ 230 కోట్ల గ్రాస్ దాటిందని చెబుతున్నారు. ఇక బాలకృష్ణ డాకుమహారాజ్ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 160 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు. ఇలా రెండు మూడు నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఈ మూవీస్ అన్నీ వందల కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరగడంతో ఐటీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో వరుస పెట్టి సోదాలు చేస్తున్నారని అసలు లెక్కలు చూసి ఏంటిదని అవాక్కు అవుతున్నారని చర్చ జరుగుతోంది.
Also Read : 8 Vasantalu Teaser : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ టీజర్ వచ్చేసింది.. బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీ..?
తెరముందు కనిపించే దానికి తెరవెనుక కనిపించే దానికి చాలా తేడా ఉంటుంది. అది మూవీలో సీన్ అయినా లాస్ట్‌కు సినిమా కలెక్షన్స్ అయినా. ఆ విషయాన్ని ఇప్పుడు ఐటీ రైడ్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఈ మధ్య ఏ హీరో మూవీ రిలీజ్ అయినా వందల కోట్ల కలెక్షన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కలెక్షన్స్ ఆ రేంజ్‌లో ఉండటం లేదట. దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నా ఇప్పుడు ఐటీ రైడ్స్‌లో అసలు కథ బయటికి వచ్చిందన్న మాటలు వినిపిస్తున్నాయి. వందల కోట్లు రాబట్టినట్లు ప్రచారం ఓవైపు ఉంటే తీరా అధికారిక లెక్కలు తీస్తే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందట.
హీరోలను, వాళ్ల ఫ్యాన్స్‌ను మెప్పించడానికి రాని కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు రిలీజ్ చేస్తుండటంతోనే ఐటీ రైడ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గొప్పల కోసం, రికార్డుల కోసం పోస్టర్లు రిలీజ్ చేస్తే ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు వాపోతున్నారట. అయితే భారీ కలెక్షన్స్ వచ్చినట్లు పోస్టర్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుందో ఐటీ వాళ్లకు చెప్తున్నా సమ్‌థింగ్ ఈజ్ దేర్ అన్న డౌట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
ఐటీ రైడ్స్ తలనొప్పి ఉండొద్దంటే అసలు వసూళ్లను మాత్రమే చూపించడం మాత్రమే పరిష్కారం. ప్రతీసారి సినిమా రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఐటీ రైడ్స్ టెన్షన్ అవసరమా అనుకుంటే యాక్చువల్ కలెక్షన్స్ ప్రకటిండమే బెటర్ అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా వచ్చిన కలెక్షన్స్ మాత్రమే చెప్పడానికి స్టార్ హీరోలు ఒప్పుకుంటారా.? అన్నది మరో రచ్చ. కానీ ఐటీకి టార్గెట్ కావొద్దంటే తప్పదు మరీ చర్చ జరుగుతోంది. టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లల్లో జరిగిన సోదాలపై ఐటీ అధికారులు అధికారిక ప్రకటన చేస్తే కలెక్షన్లు ఏంటో అసలు మ్యాటరేంటో పబ్లిక్‌కు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఐటీ రైడ్స్ బెడద తప్పుంచుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.