జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

Jr Ntr Tests Positive For Covid19

Updated On : May 10, 2021 / 3:29 PM IST

Jr NTR tests positive for Covid19: టాలీవుడ్ అగ్రనటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్  వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెెల్లడించారు ఎన్టీఆర్.

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోండగా..  జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వదల్లేదు. ఇటీవల ప్రజల్లో భయం పోగొట్టేందుకు వ్యాధి పట్ల అవగాహన కల్పించిన ఎన్టీఆర్‌కే ఇప్పుడు పాజిటివ్ వచ్చింది.

ఇప్పటికే కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆగిపోగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ టీవీ షోని కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమ్ంలోనే ఎన్టీఆర్‌కి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి ట్వీట్ చేసిన ఎన్టీఆర్.. తనను కలిసినవాళ్లను టెస్ట్ చేయించుకోవాలని కోరారు.

“లేటెస్ట్‌గా చేయించుకున్న పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సింది కోరుతున్నా” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.