మాల్దీవుల్లో కత్రినా.. షూటింగులో రానా.. కిస్ ఇచ్చిన అనుపమ!

Katrina Kaif: కరోనా కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ప్రస్తుతం మాల్దీవుల్లో సందడి చేస్తోంది.
ఓ యాడ్ షూటింగ్ కోసం కత్రినా మాల్దీవులకు వెళ్లింది. ఒకవైపు ప్రొఫెషనల్‌గా షూటింగ్ చేస్తూనే, మరోవైపు పర్సనల్‌గా టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడి బీచ్‌లో తీసుకున్న ఫొటోలను షేర్ చేసి ఇన్‌స్టాలో హీటెక్కిస్తోంది.
ఔట్ డోర్ షూటింగ్‌కు రానా
లాక్‌డౌన్ కంటే ముందే అనారోగ్యం కారణంగా షూటింగ్‌లకు దూరమైన రానా దగ్గుబాటి చాలా రోజుల తర్వాత ఈ రోజు (శుక్రవారం) షూటింగ్‌కు హాజరయ్యాడు. షూటింగ్‌కు వెళ్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఔట్ డోర్ షూటింగ్‌కు వెళ్తున్నట్టు తెలిపాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విరాటపర్వం’ సినిమాలో రానా నటిస్తున్నాడు. సాయి పల్లవి, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న అనుపమా పరమేశ్వరన్
క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనుపమా పరమేశ్వరన్ ఒక రైమ్ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అన్నీ నువ్వే నాకు అన్నట్లుగా ఆమె చెప్పిన రైమ్ సంగతి అటుంచితే.. అను వీడియో చివర్లో ఇచ్చిన ముద్దు, చూపించిన సింబల్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేలా ఉన్నాయ్. ద డ్రామా క్వీన్ అని చెబుతూ.. నా బేబీస్ అందరికీ ఐ లవ్ యు.. నేను పాడే ఈ పాట ఎంతమందికి తెలుసో.. అలాగే నాలా ఈ పాటను ప్రేమించేవారు ఎందరో తెలియజేయండి.. అంటూ ఈ వీడియో షేర్ చేసింది అనుపమా పరమేశ్వరన్.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram