Krishna : సూపర్ స్టార్ కృష్ణ కనుమూత..

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ.. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సుమారు నిన్న తెల్లవారుజాము రెండు గంటల సమయంలో అయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వాళ్ళ హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితిలో అడ్మిట్ అయ్యారు. కాగా ఈరోజు (మంగళవారం) ఉదయం 4 గంటల సమయంలో అయన కను మూసినట్లు తెలుస్తుంది. కాసేపటిలో...

Krishna : సూపర్ స్టార్ కృష్ణ కనుమూత..

Krishna has no more

Updated On : November 15, 2022 / 6:55 AM IST

Krishna : టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ.. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సుమారు నిన్న తెల్లవారుజాము రెండు గంటల సమయంలో అయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వల్ల హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో అత్యవసర పరిస్థితిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు 20 నిముషాలు పాటు CPR చేసి, ఆయన్ని కొంతవరకు సేవ్ చేసారని తెలియజేశారు.

Krishna Health Updates: మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్.. డయాలసిస్ జరుగుతోంది.. ఇప్పుడే ఏమీ చెప్పలేము : డా గురు ఎన్ రెడ్డి

నిన్న సాయంత్రం కృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ యాజమాన్యం.. 24 గంటల పాటు అబ్జర్వేషన్ ఉండాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నం. 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం మేము చెప్పలేము. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచాం. కార్డియాలజిస్ట్‌లు, న్యూరాలజిస్ట్‌లు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌లు సహా 8 మంది వైద్య బృందం కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.

కాగా ఈరోజు (మంగళవారం) ఉదయం 4 గంటల సమయంలో అయన కను మూసినట్లు తెలుస్తుంది. కాసేపటిలో కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించనున్నారు. అయన కోలుకొని వస్తారు అనుకున్న అభిమానులకు, కుటుంబస్యులకు తీరని శోకాని మిగిల్చి వెళ్లిపోయారు కృష్ణ. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇది తీరని లోటు అనే చెప్పాలి.. ఒకే ఏడాదిలో కుటుంబంలోని అమ్మ, నాన్న, అన్నయ్యని కోలోపోడం చాలా బాధాకరం.