Viral Video: అచ్చం జవాన్ సినిమాలో షారుక్‌లా ఈ యువకుడు చేసిన పనికి..
సినిమాలో షారుక్ ట్రైనులో పడుకునే పోజులోనే ఈ యువకుడు కూడా ట్రైనులో పడుకుంటాడు.

Man Recreates Shah Rukh Khan Jawan
Viral Video – Jawan: బాలీవుడ్ (Bollywood) హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తాజా చిత్రం జవాన్‌లో ట్రైన్ సీన్ ఉంటుంది. అందులో షారుక్ ఖాన్ ఒంటి నిండా గాయాలయినట్లు వేషం వేసి ట్రైనులో పడుకుంటాడు. అచ్చం అటువంటి లుక్ లోనే ఓ యువకుడు రైల్వే స్టేషన్లో కనపడ్డాడు.
సినిమాలో షారుక్ ట్రైనులో పడుకునే పోజులోనే ఈ యువకుడు కూడా ట్రైనులో పడుకుంటాడు. అతడు తల, చేతులకు కట్లతో ట్రైను ఎక్కుతుంటే అక్కడున్న వారు అందరూ అతడినే చూస్తుండిపోయారు. ఆ సీన్ ను రీక్రియేట్ చేసిన ఈ యువకుడు ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అచ్చం షారుక్ ఖాన్ లా చేశాడని ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా, జవాన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. పఠాన్ తర్వాత షారుక్ ఖాన్ ఖాతాలో మరో భారీ విజయం పడడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
View this post on Instagram
Nayanthara : దర్శకుడు అట్లీ పై నయనతార అసంతృప్తి..? కారణం దీపికేనా..?