Manjula Ghattamaneni : మీరు మా జీవితానికే సూపర్ స్టార్.. కృష్ణ కూతురు మంజుల ఎమోషనల్ ట్వీట్..

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకుంది. అయన ఇక లేరు అన్న మాట విని అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. కన్నీరు మున్నీరు అవుతున్న ఘట్టమనేని కుటుంబానికి దైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు సినీ పెద్దలు. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తన తండ్రి మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. "నాన్న నువ్వు...

Manjula Ghattamaneni : మీరు మా జీవితానికే సూపర్ స్టార్.. కృష్ణ కూతురు మంజుల ఎమోషనల్ ట్వీట్..

Manjula Ghattamaneni Emotional Tweet

Updated On : November 16, 2022 / 8:43 AM IST

Manjula Ghattamaneni : సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకుంది. అయన ఇక లేరు అన్న మాట విని అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక ఆయనకు నివాళ్లు అర్పించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న ఘట్టమనేని కుటుంబానికి దైర్యం చెబుతూ ఓదారుస్తున్నారు సినీ పెద్దలు.

Superstar Krishna : నేడు సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. కడసారి చూపుకోసం తరలివస్తున్న అభిమానులు..

కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని తన తండ్రి మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. “నాన్న నువ్వు ప్రపంచానికే సూపర్ స్టార్ కాదు మా జీవితానికి కూడా సూపర్ స్టార్‌. మీరు బయట ఎలా ఉన్నపటికీ ఇంటిలో మాకోసం ఒక సాధారణ తండ్రిలా మాకు మీ ప్రేమానురాగాలు పంచడం మాకు ఎంతో గర్వకారణం. మీరు ఉన్నా లేకపోయినా మీ ప్రేమ మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక వెండితెరపై మీ జ్ఞాపకాలు ఎప్పటికి చెరిగిపోనివి.

నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. లవ్ యు ఎప్పటికీ” అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా మరికాసేపటిలో కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్ కి తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అంతిమయాత్రగా జూబిలీహిల్స్ మహాప్రస్థానానికి చేరుకొని అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.