Mega Vs Allu : మెగా వర్సెస్ అల్లు.. రామ్‌చరణ్ అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో అయ్యాడా? లేదా?
అసలు ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ.. దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది.

Mega Vs Allu : సోషల్ మీడియాలో రామ్ చరణ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో అయ్యాడా? లేదా?.. సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. అవును.. దీని గురించి అటు అల్లు ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ లో పెద్ద డిస్కషనే జరుగుతోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని రాంచరణ్ అన్ ఫాలో చేశాడని కొందరు, అదేమీ లేదని మరికొందరు.. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు ప్రచారం చేసేస్తున్నారు.
అసలు ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?
అసలు ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ.. దీనిపై పెద్ద రచ్చే జరుగుతోంది. జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు అంతకుముందు వారిద్దరు ఒకరినొకరు ఫాలో అయ్యారో లేదో కూడా తెలీదు. తాజాగా అన్ ఫాలో అయ్యారో లేదో కూడా క్లారిటీ లేదు. కానీ, నెటిజన్లు మాత్రం.. అన్ ఫాలో అయ్యాడు అన్ ఫాలో అయ్యాడు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఓవరాల్ గా.. రాంచరణ్.. అల్లు అర్జున్ ని అన్ ఫాలో అయ్యాడా? లేదా? అనేది వారిద్దరికే ఎరుక. వారి హ్యాండిల్స్ ని హ్యాండిల్ చేసే టీమ్స్ కి, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారో వారికి మాత్రమే ఎరుక.
సోషల్ మీడియాలో చరణ్, బన్నీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్..
మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇరువురి ఫ్యాన్స్ ఏదో ఒక అంశంలో కామెంట్లు పెడుతూనే ఉంటారు. గతంలో కొన్నిసార్లు మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ కూడా నడిచింది.
Also Read : విజయ్ దేవరకొండ ‘VD12’ చిత్రానికి ‘కింగ్‌డమ్’ టైటిల్.. అంచనాలు రెట్టింపు చేసిన టీజర్!
అల్లు అర్జున్, రాంచరణ్.. బంధువులే అయినప్పటికీ.. రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్ స్ట్రా గ్రామ్ లో అల్లు అర్జున్ ని రాంచరణ్ అన్ ఫాలో చేశాడనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.
మెగా వర్సెస్ అల్లు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి పుల్ స్టాప్ పెట్టేలా ఇటీవల ఒక ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి పుష్ప 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు.
Also Read : చిరంజీవి సరదాగా చేసిన కామెంట్స్ పై విమర్శలు.. వారసుడు కావాలని కోరుకోవడంతో..
ఇక, రాంచరణ్ తనకు కొడుకు లాంటి వాడని అల్లు అరవింద్ సైతం చెప్పారు. అలా.. తమ రెండు కాంపౌండ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు ప్రకటించే ప్రయత్నం చేశారన్నది నెటిజన్ల అభిప్రాయం. ఇక ఈ వ్యవహారం సద్దుమణిగినట్లే అని అంతా అనుకునేలోపే.. ఈ అన్ ఫాలో రచ్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడీ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.