RRR Movie : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. వీడియో వైరల్
సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ‘నాటు నాటు’ పాటకు కాలు కదుపుతున్నారు..

Naatufied In Usa
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ పాటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో రచ్చ లేపారు. ఈ ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే పాటలో స్టెప్పులేస్తే స్క్రీన్స్ చిరగడం పక్కా..
NTR 31 : ‘సలార్’ రెండు పార్టులు! అందుకే బుచ్చిబాబు లైన్‌లోకి వచ్చాడా?
సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు. రీసెంట్‌గా అమెరికాలో ఓ కుర్రాడు, టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Naatufied in USA పేరుతో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
Ram Charan : శ్రీజతో రామ్ చరణ్.. పిక్స్ వైరల్..
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి బాక్సాఫీస్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల రచ్చ కంటిన్యూ అవుతుండేది. జనవరి 7 నుండి వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఆచార్య’ కంప్లీట్ చేసి, శంకర్ మూవీకి షిఫ్ట్ అయ్యాడు చరణ్. కానీ తారక్ మాత్రం మూడేళ్లుగా వేరే సినిమా చెయ్యలేదు.
Naatufied in USA?? #NaatuNaatu #RoarOfRrrInUSA #RoarOfRRR@wrightstate @RRRMovie @tarak9999 @ssrajamouli pic.twitter.com/9256eVf5Rz
— mahendRRRa talasila? (@mahitalasila) January 29, 2022