New Movie Opening : కోబలి నిర్మాతల కొత్త సినిమా ఓపెనింగ్.. లవ్ స్టోరీతో..

హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా కొత్త సినిమా మొదలైంది.

New Movie Opening : కోబలి నిర్మాతల కొత్త సినిమా ఓపెనింగ్.. లవ్ స్టోరీతో..

New Movie Opening by Kobali Producers Village Love Story

Updated On : April 29, 2025 / 2:28 PM IST

New Movie Opening : హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా కొత్త సినిమా మొదలైంది. టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించారు. ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఓపెనింగ్ సందర్భంగా డైరెక్టర్ ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించబోతున్నాం. గతంలో ఈ TSR మూవీ మేకర్స్ బ్యానర్ లో తికమక తాండ, కోబలి వంటి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి. కోబలి సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అలంటి బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలిపారు.

Also Read : NTR – Neel : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ వాయిదా.. సంక్రాంతి బరి నుంచి అవుట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అప్పుడే..

నిర్మాత తిరుపతి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చింది. కొత్త జోనర్ లో వైవిధ్యమైన లొకేషన్స్ లలో ఈ సినిమాని తెరకెక్కించి ఆడియన్స్ కి కొత్త అనుభూతి ఇస్తాం అని తెలిపారు.

New Movie Opening by Kobali Producers Village Love Story