Movie Releases: నైట్ కర్ఫ్యూ.. సగమే ఆక్యుపెన్సీ.. ఖిలాడీ వర్క్ఔట్ అవుతుందా?

చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోయింది. నిన్న కాక మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్లే అనిపిస్తున్నా ఫిబ్రవరి మొదటి వారం కూడా గడిచిపోయింది. ఇక కరోనా కూడా మెల్లగా తగ్గుముఖం పట్టడంతో..

Movie Releases: నైట్ కర్ఫ్యూ.. సగమే ఆక్యుపెన్సీ.. ఖిలాడీ వర్క్ఔట్ అవుతుందా?

Movie Releases

Updated On : February 7, 2022 / 10:11 PM IST

Movie Releases: చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోయింది. నిన్న కాక మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్లే అనిపిస్తున్నా ఫిబ్రవరి మొదటి వారం కూడా గడిచిపోయింది. ఇక కరోనా కూడా మెల్లగా తగ్గుముఖం పట్టడంతో సినిమా వాళ్ళు రిలీజ్ డేట్స్ ఇచ్చేశారు. ఫిబ్రవరి రెండో వారం.. అది కూడా వాలంటైన్ డే కూడా ఉండడంతో ఇప్పటి నుండే సినిమా జాతర మొదలు పెట్టేస్తున్నారు. గతంలో క్రాక్ సినిమాతో కరోనాలో కూడా హిట్టు కొట్టిన రవితేజనే ఈసారి కూడా ఖిలాడీగా వచ్చేస్తున్నాడు.

Khiladi: మీనాక్షికి మాస్‌రాజా లిప్‌లాక్.. మరీ ఇంత దూకుడా?

ఫిబ్రవరి 11న రవితేజ ఖిలాడీ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది ఈ సినిమా. అయితే.. తెలుగు రాష్ట్రాలలో కరోనా ప్రభావంతో ఎలాంటి ఆంక్షలు లేకపోగా ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూలు ఉన్నాయి. సగం ఆక్యుపెన్సీ పెద్దగా ప్రభావం చూపకపోయినా నైట్ కర్ఫ్యూ మాత్రం ఖిలాడీ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని అంచనా.

Samantha: సామ్ డిసిప్లైన్ కొటేషన్.. సోషల్ మీడియాలో చర్చ!

ఇక, ఎప్పటి నుండో కొనసాగుతున్న టికెట్ల వివాదం కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ప్రభుత్వం సినీ పెద్దలతో చాలాసార్లు చర్చలు జరపడం.. అలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినా ఇప్పటికైతే అది ఇంకా కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ముందుగా రాబోతున్న ఖిలాడీకి ఈ సమస్యలతో వర్క్ ఔట్ అవుతుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాపై ఏపీలో సమస్యలు పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే.. అప్పుడు పండగ సీజన్ కావడంతో నడిచిపోయింది. మరి ఇప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది చూడాల్సి ఉంది.