సైరాకు జీఎస్టీ ఎఫెక్ట్: రూ.20కోట్లు కట్టిన రామ్‌చరణ్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా సైరా నరసింహా రెడ్డి. 150 చిత్రాలు చేసిన తండ్రికి కెరీర్ బెస్ట్ మూవీ అందించాలనే ఉద్ధేశ్యంతో రామ్ చరణ్ ‘సైరా’ సినిమాని భారీ బడ్జెట్‌తో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కించాడు.
అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చారిత్రక చిత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమాకి పన్ను మినహాయింపు కోసం చిత్రయూనిట్ శతవిధాల ట్రై చేసింది. అయితే మెగా ఫ్యామిలీకి జీఎస్టీ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
స్వాతంత్య్ర సమరయోధుల కథల్ని తెరకెక్కించినప్పుడు ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు ఉంటుందని భావించగా.. సైరా నరసింహారెడ్డి సినిమాకి కూడా పన్ను మినహాయింపు ఉంటుందని మెగా ఫ్యామిలీ భావించింది. అయితే ‘సైరా’ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి పన్ను మినహాయింపు లభించలేదు. దీంతో చిత్ర నిర్మాతకి జీఎస్టీ దెబ్బ బాగానే తాకిందట. గతంలో కొన్ని చారిత్రక చిత్రాలకు ఇలాంటి మినహాయింపు లభింనా సైరాకు మాత్రం లభించలేదు. దీంతో రామ్ చరణ్ కేవలం జీఎస్టీ రూపంలో రూ.20 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తుంది.