Pawan Kalyan : చేతికి సెలైన్ కాన్యులాతో పవన్ కళ్యాణ్.. అలాగే సమావేశాల్లో పాల్గొని.. ఏమైంది అంటూ అభిమానులు కంగారు..
సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాక ఎయిర్ పోర్ట్ లో కనపడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్నే కనిపించారు.

Pawan Kalyan Hand with saline IV Cannula Photos goes Viral Fans Worried
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వ కార్యకలాపాలు మరోవైపు సినిమాలు మరోవైపు గ్రామాల అభివృద్ధి పనులతో బిజీబిజీగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవలే తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకొని బయటపడటంతో సింగపూర్ వెళ్లొచ్చారు పవన్. సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చాక ఎయిర్ పోర్ట్ లో కనపడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నిన్నే కనిపించారు.
నిన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సంఘ సభ్యులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఫోటోలు అధికారికంగా షేర్ చేయడంతో ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ ఎక్కించే IV కాన్యులా ఉంది. అంటే పవన్ సెలైన్ ఎక్కించుకున్నాడని తెలుస్తుంది.
Also Read : Samantha : సమంత ఫ్యాన్స్ కి నిరాశే.. ఆ వెబ్ సిరీస్ రాదు.. క్యాన్సిల్ చేసిన ఓటీటీ..
దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో పవన్ ఎందుకు సెలైన్ పెట్టుకున్నాడు? సెలైన్ పెట్టుకునేంతగా పవన్ కళ్యాణ్ కి ఏం ఆరోగ్య సమస్యలు వచ్చాయి? పవన్ హెల్త్ కి ఏమైంది అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఓ పక్క పవన్ కి ఏమైంది అని కంగారు పడుతూనే మరో పక్క ఆరోగ్యం బాగోలేకపోయినా ఇలా సమావేశాల్లో పాల్గొనడం గ్రేట్ అని అభినందిస్తున్నారు.