వాల్మీకి సినిమాపై హైకోర్టులో పిటిషన్

వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి ప్రతాలతో పాటు పూర్తి ఆధారాలు సమర్పించాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
వాల్మీకి సినిమా టైటిల్‌ను మార్చాలని కోరుతూ ఇటీవల సీజీఓ టవర్స్‌లోని సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ మార్చాలని బోయ కులస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకి బోయలతో పాటు హిందువుల ఆరాధ్య దైవమన్నారు. అలాంటి మహనీయుడి పేరు మీద సినిమా తీయడం సరైంది కాదని హితవు పలికారు. సినిమా పేరును మార్చాలని డిమాండ్ చేశారు.
Also Read : ఫిదా కాంబినేషన్.. కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు