Ram Charan : విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ చూశారా? ఏకంగా 256 అడుగులు..

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Ram Charan : విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ చూశారా?  ఏకంగా 256 అడుగులు..

Ram Charan Massive 256 foot cut out At Vijayawada

Updated On : December 29, 2024 / 5:30 PM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్ర విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ‌లో రామ్‌చ‌ర‌ణ్ భారీ క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు మెగా అభిమానులు.

రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌టౌట్ 256 అడుగుల పొడ‌వు ఉంది.

Top Music Directors 2024 : 2024లో రికార్డులు బద్దలు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్లు

ఇది దేశంలోనే అతి పెద్ద క‌టౌట్ అని అభిమానులు అంటున్నారు. వారం రోజుల పాటు శ్ర‌మించి ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసిన‌ట్లుగా వారు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజ‌ర్ చిత్రంలో కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ బాష‌ల్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచేశాయి.

Unstoppable With NBK : బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో డాకు మ‌హారాజ్ ద‌ర్శ‌కుడు..