Paarijatha Parvam : కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్న పారిజాత పర్వం టీం..

మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్న పారిజాత పర్వం టీం.. కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్నారు.

Paarijatha Parvam : కిడ్నాప్ చేయడానికి ఆర్జీవీని తీసుకు వస్తున్న పారిజాత పర్వం టీం..

Ram Gopal Varma is chief guest for shraddha das Paarijatha Parvam

Updated On : April 15, 2024 / 4:12 PM IST

Paarijatha Parvam : అందాల భామ శ్రద్దా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ డ్రామా మూవీ ‘పారిజాత పర్వం’. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, చైతన్య రావు మదాది, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సమీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ డిఫరెంట్ గా నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఈ సినిమా కథ కిడ్నాప్ నేపథ్యంతో సాగుతుంది. దీంతో ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయడం కోసం.. కిడ్నాప్ చేయడం ఒక ఆర్ట్, కిడ్నాప్ చేసేందుకు కొందరు మనుషులు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చి ప్రమోషన్ చేసి ఆకట్టుకున్నారు. ఇలా క్రేజీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా డిఫరెంట్ గా చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

Also read : Pushpa 2 : పుష్ప 2కి లైన్ క్లియర్.. బాహుబలి కలెక్షన్స్‌ దగ్గరకి వెళ్లే ఛాన్స్..

ఈక్రమంలోనే ప్రీ కిడ్నప్ ఈవెంట్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ గెస్ట్ గా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని తీసుకు వస్తున్నారు. హైదరాబాద్ లో నేడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. మరి ఈవెంట్ లో ఎలాంటి క్రేజీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేసారో చూడాలి.

Ram Gopal Varma is chief guest for shraddha das Paarijatha Parvam