అరేయ్ ఖబడ్దార్.. వర్మ వార్నింగ్..

తన సినిమాపై కక్ష గడుతున్న వాళ్ళందరికీ, తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 06:15 AM IST
అరేయ్ ఖబడ్దార్.. వర్మ వార్నింగ్..

Updated On : February 5, 2019 / 6:15 AM IST

తన సినిమాపై కక్ష గడుతున్న వాళ్ళందరికీ, తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడెలా ఉంటాడో, ఏ విషయానికి ఎలా రియాక్ట్ అవుతాడో ఆయనకే తెలియదు. వివాదాలు వర్మకి ప్రియ నేస్తాలు. వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించబోతున్నానని, వెన్నుపోటు అంశం హైలెట్ అవుతుందని వర్మ చెప్పడంతో, కొందరు టీడీపీ కార్యకర్తలు ఆయనపై కేసులు కూడా పెట్టారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ నుండి రెండు పాటలు రిలీజ్ చేసిన ఆర్జీవీ, రోజుకో లేటెస్ట్ పిక్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడొక అడుగుముందుకేసి, తన సినిమాపై కక్ష గడుతున్న వాళ్ళందరికీ, తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు..

అరేయ్,  లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్‌కి ఎవరైనా అడ్డొస్తే ఖబర్దార్ అని ట్వీట్ చేస్తూ, పంచె కట్టుకుని, చేత్తో కత్తి పట్టుకుని ఉన్న పిక్ పోస్ట్ చేసాడు. చూస్తుంటే, ఆ పిక్.. సూర్య యముడు సినిమాలోదిలా ఉంది. దాన్ని ఎవరో మార్ఫింగ్ చేసి, వర్మకి సెండ్ చేస్తే, మనోడు దాన్ని సినిమా పబ్లిసిటీకి వాడుకుంటున్నాడు. ఇక రెండో ఫోటో పెట్టి, రేయ్.. ఎన్టీఆర్ కథానాయకుడూ కాదు, మహానాయకుడూ కాదురా, ఆయన అసలు నాయకుడు.. ఆ నిజం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌లోని అసలు కథలో తెలుస్తుందిరా.. డబుల్ ఖబర్దార్.. అని ట్వీట్ చేసాడు..

ఇక ముచ్చటగా మూడవ ఫోటోకి, ఎన్టీఆర్ గారు అసలు నాయకుడు, నేను ముదురు నాయాకుడిని.. మిగతా వాళ్ళు రకరకాల వేరే రకాల నాయకులు, వెన్నుపోటు నాయకులతో సహా.. అని ట్వీట్ చేసాడు.. ఇప్పుడు వర్మ పిక్, పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి..