Movies : ఈ వారం తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలు..

ఈ వారం భారీ సినిమాలు ఏమి లేవు. డైరెక్ట్ తెలుగు సినిమాలు చిన్నవి మూడు ఉండగా, తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటి ఉంది.

Movies : ఈ వారం తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అయ్యే సినిమాలు..

September Second Week Theatrical Releasing Movies Mark Antony Ramanna Youth

Updated On : September 11, 2023 / 10:36 AM IST

Theatrical Movies : గత వారం జవాన్(Jawan), మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. జవాన్ ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసి దూసుకుపోతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి కనెక్ట్ అయి అందర్నీ నవ్విస్తుంది.

ఆ రెండు సినిమాలా హవా సాగుతూనే ఉంది. ఇక ఈ వారం భారీ సినిమాలు ఏమి లేవు. డైరెక్ట్ తెలుగు సినిమాలు చిన్నవి మూడు ఉండగా, తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటి ఉంది.

విశాల్(Vishal) హీరోగా, రీతువర్మ, అభినయ హీరోయిన్స్ గా ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘మార్క్ ఆంటోనీ’(Mark Antony) సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా, టైం ట్రావెల్ ఫోన్ అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Image

యువ నటుడు అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”(Ramanna Youth). ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.

Image

రవితేజ నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఛాంగురే బంగారు రాజా’(Changure Bangaru Raja) అనే క్రైమ్ కామెడీ సినిమా సెప్టెంబర్ 15న ఆడియన్స్ ముందుకు రానుంది. సతీష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం నటుడు కార్తీక్ రత్నం, రవిబాబు, సత్య, ఎస్తర్ నోరాన్హా, గోల్డీ నిస్సీ, నిత్యశ్రీ.. పలువురు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

Image

Delhi Kumar : ఆ హీరో నా సొంత కొడుకే.. కానీ మా మధ్య ఆ బంధం లేదు.. అరవింద్ స్వామిపై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…'(Sodara Sodarimanulaara). ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.

Sodara Sodarimanulara