Super Star Krishna: అత్యంత ఆప్తుడ్ని కోల్పోయా.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి – సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన నాటి డైరక్టర్ పి. చంద్రశేఖర్ రెడ్డి కనుమూశారు. ఆయన మరణంపై సూపర్ స్టార్ కృష్ణ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

Super Star Krishna: అత్యంత ఆప్తుడ్ని కోల్పోయా.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి – సూపర్ స్టార్ కృష్ణ

Krishna

Updated On : January 3, 2022 / 5:50 PM IST

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తొలి చిత్రానికి దర్శకత్వం వహించిన నాటి డైరక్టర్ పి. చంద్రశేఖర్ రెడ్డి కనుమూశారు. ఆయన మరణంపై సూపర్ స్టార్ కృష్ణ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా, మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా కలిసిపోయే ఆప్తులని కొనియాడారు. తొలి చిత్రం అత్తలు – కోడళ్ళు, రెండో చిత్రం అనురాధలలో కూడా హీరోగా చేశానని గుర్తు చేసుకున్నారు.

ఇల్లు – ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం లాంటి మంచి హిట్ మూవీస్ మాత్రమే కాకుండా ఇద్దరి కాంబినేషన్ లో 23 చిత్రాలు వచ్చాయి. పద్మాలయ అనుబంధ సంస్థలోనూ ఆయన డైరెక్టర్ గా వ్యవహరించారు.

చాలా ఆప్తులైన వ్యక్తిని కోల్పోయామంటూ విచారం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తానని అన్నారు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ.

ఇది కూడా చదవండి.. మోదీని షా అంత మాట అన్నారా! మేఘాలయ గవర్నర్ వివరణ