రాజకీయాలకు రజినీ గుడ్‌బై? నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజలకు, అభిమానులకే వదిలేస్తున్నా!

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక రజినీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పినా పార్టీ పేరు, మ్యానిఫెస్టో వంటివి ప్రకటించికపోవడంతో ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదంటూ నెట్టింట్లో ఓ లెటర్ వైరల్ అవుతోంది.
దీంతో తనపై వస్తున్న వార్తల గురించి స్వయంగా రజినీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలోని ప్రెస్‌నోట్ తనది కాదని ట్విట్టర్ ద్వారా స్పందించారు తలైవా..
‘‘నాకు ప్రాణం గురించి భయం లేదు. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ల క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం క్షీణిస్తే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది. నాకు కిడ్నీ సమస్య ఉంది. డయాలసిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినా బయటకు వెళ్లకూడదని డాక్టర్స్ సూచించారు. అయినప్పటికీ ముందుకెళ్లాలంటే జనవరి 15 లోపు పార్టీని ప్రారంభించాలి. అయితే నేను ఏ నిర్ణయం తీసుకోవాలో ప్రజలకు, అభిమానులకు వదిలేస్తున్నా’’ అంటూ రజినీ పేర్కొన్నారు.
— Rajinikanth (@rajinikanth) October 29, 2020