Kamal Haasan : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కమల్ హాసన్

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయన్ పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనాతో నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 12 రోజుల చికిత్స అనంతరం శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Kamal Haasan : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కమల్ హాసన్

Kamal Haasan

Updated On : December 4, 2021 / 5:35 PM IST

Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయన్ పార్టీ అధినేత కమల్ హాసన్ కరోనాతో నవంబర్ 22న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. 12 రోజుల చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న కమల్ శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

చదవండి : Kamal Haasan : కమల్ హాసన్‌కు కరోనా..

తనకు వైద్యం అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యబృందానికి కమల్ హాసన్ కృతజ్ఞతలు చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. వెంటనే తన కార్యక్రమాలు మొదలు పెడతానని తెలిపారు.

చదవండి : Kamal Haasan : కోలుకున్న కమల్ హాసన్..