Japan Teaser : తెలుగు గజదొంగగా రవితేజ కనిపిస్తుంటే.. తమిళ్ గజదొంగగా కార్తీ వస్తున్నాడు..
తెలుగు గజదొంగ టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ గజదొంగగా తిరువారూర్ ముర్గన్.. అప్పటి పోలీసులను కొన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరి కథలతో..

Tamil hero Karthi Japan movie Teaser released
Japan Teaser : కోలీవుడ్ హీరో కార్తీ రాజు మురుగన్ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ కామెడీ సినిమా ‘జపాన్’. ఈ క్రేజీ టైటిల్ కి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే ట్యాగ్ లైన్ పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ లో కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కార్తీ గజదొంగగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఒక రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే ఆ వార్త నిజమనే తెలుస్తుంది. 2019లో చెన్నైలోని లలితా జ్యువెలరీ షాప్ లో దాదాపు 13 కోట్ల విలువైన బంగార ఆభరణాలు, వజ్రాలను దొంగతనం చేసిన తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి కథ ఆధారంగా జపాన్ మూవీ తెరకెక్కబోతుందట. ఈ దొంగ తమిళనాడుతో పాటు సౌత్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో అనేక దోపిడీలు పాల్పడ్డాడు. ఈ దొంగ కథనే జపాన్ గా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ఒకసారి మీరుకూడా చూసేయండి.
Also read : Ram Charan : నాన్నని చూసి నేర్చుకున్నాను.. రామ్ చరణ్ కొత్త యాడ్ ఎమోషనల్‌గా..
కాగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు గజదొంగ టైగర్ నాగేశ్వరరావు, తమిళ్ గజదొంగగా తిరువారూర్ ముర్గన్.. అప్పటి పోలీసులను కొన్నాళ్ళు ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరి కథలతో స్టార్ హీరోలు అయిన రవితేజ, కార్తీ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాయి చూడాలి.