Mirai : తేజ సజ్జ ‘మిరాయ్’ కొత్త పోస్టర్ చూశారా..? తేజ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు..
తాజాగా నేడు దసరా సందర్భంగా మిరాయ్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

Teja Sajja Mirai Movie New Poster Released on Dasara
Mirai : ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ మిరాయ్ అనే భారీ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మిరాయ్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు అప్డేట్.. ఫ్యాన్స్ కోసం మళ్ళీ పవన్ ఆ పని.. పోస్టర్ అదిరిందిగా..
కళింగ యుద్ధం తరువాత యోగిగా మారిన అశోకుడు రాసిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాటం, ఆ గ్రంథాన్ని కాపాడడం కోసం ఉండే ఒక యోధుడు కథతో ఈ మిరాయ్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని 2025 ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా నేడు దసరా సందర్భంగా మిరాయ్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో తేజ సజ్జ ఆయుధం పట్టుకొని కూర్చొని ఆవేశంగా చూస్తుంటే వెనక సాధువులు త్రిశూలాలు పట్టుకొని ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే తేజ ఈసారి కూడా ఏదో గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ తో మిరాయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Team #MIRAI ⚔️ wishes you all a victorious and joyous Dussehra ❤️🔥
May you rise over every challenge and emerge victorious, just like our #SuperYodha 🥷#HappyDussehra ✨
SuperHero @tejasajja123
Rocking Star @HeroManoj1 @Karthik_gatta @vishwaprasadtg @RitikaNayak_… pic.twitter.com/Zpdmi6x7Fr— People Media Factory (@peoplemediafcy) October 12, 2024