Mahima Chaudhry : ముద్దు కూడా పెట్టుకోని వర్జిన్స్‌నే కోరుకునేది, ఇండస్ట్రీ గురించి నటి సంచలన వ్యాఖ్యలు
అప్పటివరకు ముద్దు కూడా పెట్టుకోని కన్యలని కోరుకునేది అని బాలీవుడ్ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ హీరోయిన్ ఎవరితోనైనా డేటింగ్ మొదలు

Mahima Chaudhry
Mahima Chaudhry : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్యలనే కోరుకునేది. అదీ అప్పటివరకు ముద్దు కూడా పెట్టుకోని కన్యలని కోరుకునేది అని బాలీవుడ్ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ కామెంట్స్ చేసింది. ఓ హీరోయిన్ ఎవరితోనైనా డేటింగ్ మొదలుపెట్టినా లేదా పెళ్లి చేసుకున్నా అంతటితో వాళ్ల కెరీర్ ముగిసిపోయేదని అప్పటి పరిస్థితులను ఆమె గుర్తు చేసుకుంది. కానీ, ఇప్పుడలా కాదని పరిస్థితులు మారిపోయాయని.. ప్రేక్షకులు విభిన్నమైన పాత్రల్లో మహిళా నటులను అంగీకరిస్తున్నారని మహిమా అన్నారు. పదేళ్ల నాటి క్రితం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఫిమేల్ యాక్టర్లు మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పింది.
Doctor Rape : దారుణం… బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్‌పై అత్యాచారం
”పరిశ్రమలో మహిళా నటీనటులు కూడా పిలుపునిచ్చే స్థితికి చేరుతున్నారని నేను అనుకుంటున్నాను. వారు పోషించడానికి మంచి పాత్రలు, మెరుగైన వేతనం, ఆమోదాలు పొందుతున్నారు. వారు గొప్ప, అత్యంత శక్తివంతమైన స్థితిలో ఉన్నారు. వారు మునుపటి కంటే మెరుగైన జీవితాన్ని కలిగి ఉన్నారు” అని మహిమా చౌదరి చెప్పింది.
Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..
“ఇప్పుడు, ప్రజలు వివిధ రకాల పాత్రల్లో మహిళలను అంగీకరిస్తున్నారు. తల్లి లేదా భార్యగా మారిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. గతంలో పురుషులు కూడా తమ వ్యక్తిగత జీవితాలను దాచిపెట్టే వారు. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయాయి” అని మహిమా అంది.
1997లో ‘పర్దేస్’ సినిమాతో మహిమా తన కెరీర్‌ని ప్రారంభించింది. ‘పర్దేస్’ లో షారుఖ్ ఖాన్, అపూర్వ అగ్నిహోత్రి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్ ఘని దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మహిమా 2006 లో బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. ఈ జంటకి 2007లో కూతురు(అరియానా) పుట్టింది. మహిమా దంపతులు 2013లో విడాకులు తీసుకున్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మహిమా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.