తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తికి రష్మిక ఏం చెప్పిందో తెలిస్తే శభాష్ అంటారు..

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 04:13 PM IST
తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తికి రష్మిక ఏం చెప్పిందో తెలిస్తే శభాష్ అంటారు..

Updated On : September 22, 2020 / 5:01 PM IST

Rashmika Mandanna: ఎవరైనా ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? అని అడిగాడనుకోండి అప్పుడు ఆ అమ్మాయి ఏం చెబుతుంది? హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, లక్షల్లో శాలరీ ఉండాలి, కార్, ఓన్ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్.. ఇలా కోరికల చిట్టా విప్పుతారు..


ఈ లిస్టులో ఈ కాలం అమ్మాయిలు చాలామందే ఉంటారు. కానీ తనను ఓ అబ్బాయి ఇదే మాట అడిగితే ఎవరూ ఊహించని సమాధానమిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది కన్నడ చిన్నది రష్మిక.


‘‘ఇటీవల ఓ వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. ఫస్ట్ నన్ను వచ్చి కలవాలి. ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం. ప్రొసీజర్ ఏంటనేది అప్పుడు చెబుతాను. నన్ను ఎలా కలవాలో మా టీమ్‌ను అడగండి. వాళ్లకు మెసేజ్ చేయండి’’.. అని సమాధానమిచ్చింది రష్మిక.


తనో స్టార్ అనే ఇగో ఏమాత్రం లేకుండా.. చాలా ప్రాక్టికల్‌గా సమాధానం ఇచ్చింది రష్మిక. ఈ ముద్దుగుమ్మ స్టేట్‌మెంట్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక త్వరలో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’లో నటించనుంది.