Superstar Krishna Passed Away : నేడు తెలుగు సినీ పరిశ్రమ బంద్.. నిర్మాత మండలి!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అకాల మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణ గారిని కూడా కోల్పోవడంతో తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో టాలీవుడ్ నిర్మాత మండలి కృష్ణ గారి గౌరవార్థం నేడు...

Tollywood shutdown today to pay last respects to super star krishna
Superstar Krishna Passed Away : టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అకాల మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిని కోల్పోయిన రెండు నెలలు వ్యవధిలోనే తండ్రి కోల్పుయిన మహేష్ ఆవేదన, అతని కన్నీరు చూసి అభిమానులతో పాటు సినీ పెద్దలు కూడా చలించిపోతున్నారు. కృష్ణ గారిని కూడా కోల్పోవడంతో తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది.
Superstar Krishna : కృష్ణ గారిని కడసారి చూడనివ్వడం లేదు.. ఫ్యాన్స్ ఆందోళన!
దీంతో టాలీవుడ్ నిర్మాత మండలి కృష్ణ గారి గౌరవార్థం నేడు షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కృష్ణ గారి అంతిమయాత్రలో టాలీవుడ్ నటులు అందరూ పాల్గొనాలంటూ ‘మా’ అసోసియేషన్ పిలుపునిచ్చింది. మరికాసేపటిలో అభిమానుల సందర్శనార్థం కోసం కృష్ణ గారి భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే సందర్శనార్థం ఉంచనున్నారు.
అయితే తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానాలు.. రాత్రి నుంచి చలిలో కృష్ణ గారి ఇంటి బయటే ఉన్నా, ఇంకా తమని లోపాలకి అనుమతించడం లేదని. ఇప్పుడేమో పద్మాలయ స్టూడియోస్ కి వెళ్ళమంటున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కృష్ణ గారికి నివాళు అర్పించనున్నారు.