Unstoppable with NBK : బాబు రెడీ బాబు.. న్యూ థీమ్ ప్రోమో ఎప్పుడంటే..

బాలయ్య టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ఎపిసోడ్స్ షూటింగ్ అండ్ ప్రోమో డీటెయిల్స్..

Unstoppable with NBK : బాబు రెడీ బాబు.. న్యూ థీమ్ ప్రోమో ఎప్పుడంటే..

Balayya

Updated On : October 21, 2021 / 5:59 PM IST

Unstoppable with NBK: నటసింహా నందమూరి బాలకృష్ణ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ ద్వారా ఫస్ట్ టైం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ లో నటసింహంతో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ టాక్ షో చెయ్యబోతున్నట్లు స్నీక్ పీక్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు ‘ఆహా’ టీం.

Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్‌లో బాలయ్య రాయల్ ఎంట్రీ..

బాలయ్యను సరికొత్త గెటప్‌లో చూపిస్తూ.. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్’ అంటూ ‘ఆహా’ అనిపించేలా ‘ఆహా’ డిఫరెంట్‌గా చేస్తున్న ప్రమోషన్స్‌కి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

ఈ షో తో మరికొద్ది రోజుల్లో బాలయ్య బాబు నేరుగా మన ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటివరకు నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రోమోస్ షూట్ చేశారు. రీసెంట్‌గా వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Unstoppable With NBK : బాలయ్య ఫ్యాన్స్‌తో ‘ఆహా’ ప్రమోషనల్ వీడియో

ఈ వీకెండ్‌ న్యూ థీమ్ ప్రోమో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈనెల 25 నుండి ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 12 ఎపిసోడ్లతో ఈ షో ఉండబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 4 నుంచి ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ స్ట్రీమింగ్ కానుంది.

Nbk Show