Chiru Diwali Party : అలనాటి స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో.. బాలయ్య కూడా ఉంటే బాగుండేది..

చిరంజీవి దివాళీ పార్టీలో అలనాటి స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో. అయితే బాలయ్య కూడా ఉండి ఉంటే బాగుండేది అంటూ అభిమానులు..

Chiru Diwali Party : అలనాటి స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో.. బాలయ్య కూడా ఉంటే బాగుండేది..

Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed

Updated On : November 12, 2023 / 9:27 PM IST

Chiru Diwali Party : దీపావళి పండగని టాలీవుడ్ సెలబ్రిటీలంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ టాలీవుడ్ స్టార్స్ అందరికి చిరంజీవి ఇంటి ఒక దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ దివాళీ బ్యాష్‌ని రామ్ చరణ్, ఉపాసన హోస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీకి మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకీ మామ, మహేష్ బాబు ఉన్న ఫోటో మార్నింగ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. తాజాగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో బయటకి వచ్చింది. అలనాటి స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉండడం చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఫ్రేమ్ లో బాలకృష్ణ కూడా ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండేదని మరికొంత మంది అభిమానులు తన ఆశని వ్యక్తం చేస్తున్నారు. ఈ పిక్స్ తో మరొకొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Also read : NTR : సల్మాన్ ఖాన్ టైగర్ 3లో ఎన్టీఆర్ రోల్.. ఊరమస్ ఎలివేషన్‌తో సీన్..

ఈ పార్టీలో అల్లు అర్జున్ ఫోటో కోసం ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణ కూడా ఫలించింది. వెంకీతో అల్లు అర్జున్ ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. మరి ఆ పిక్స్ వైపు ఒక లుక్ వేసేయండి.

Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed Venkatesh Nagarjuna at Chiranjeevi Diwali Bash Balakrishna missed