NTR : సల్మాన్ ఖాన్ టైగర్ 3లో ఎన్టీఆర్ రోల్.. ఊరమస్ ఎలివేషన్‌తో సీన్..
సల్మాన్ ఖాన్ టైగర్ 3లో ఎన్టీఆర్ రోల్ కి ఊరమస్ ఎలివేషన్‌తో ఒక సీన్ ఉంది. స్పై యూనివర్స్ లోనే ఎన్టీఆర్ గ్రేట్ విలన్‌గా..

War 2 star NTR reference in Salman Khan Tiger 3 along with Hrithik Roshan
NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టుకుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం పై స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇదే బ్యానర్ లో తెరకెక్కిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్’ సిరీస్ కూడా ఈ యూనివర్స్ లో భాగంగానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. సల్మాన్ నటించిన టైగర్ 3 దివాళీ కానుకగా నేడు రిలీజ్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘మేజర్ కబీర్ ధలీవాల్’ పాత్రల్లో గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు. వీరితో పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ అపిరెన్స్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. వార్ 2లో ఎన్టీఆర్ పాత్రని టైగర్ 3లోనే పరిచయం చేయబోతున్నారంటూ బాలీవుడ్ లో ఒక న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అయితే టైగర్ 3లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లేదు గాని, అతని పాత్రని డైలాగ్స్ తో ఆడియన్స్ కి పరిచయం చేసినట్లు తెలుస్తుంది. టైగర్ 3లో హృతిక్ ఎంట్రీ టైములో ఓ భయంకరమైన విలన్ గురించి హృతిక్ ఒక ఆఫీస్ చెబుతుంటాడు.
Also read : Game Changer : దివాళీ రోజున రామ్ చరణ్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్..
“మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాము. అతడికి పేరు, మొఖం అనేవి లేవు. భయానికే భయం కలిగించే ఆ వ్యక్తి మరణం కన్నా డేంజర్. ఆ సైతాన్ తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్ వి అయ్యిపోతావేమో” అంటూ హృతిక్ చెబుతాడు. ఇక ఈ డైలాగ్స్ విన్న అభిమానులు.. ఆ శత్రువు ఎవరో కాదు ఎన్టీఆరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ కి విలన్ గా కనిపించబోతున్నాడని, యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లోనే ఎన్టీఆర్ గ్రేట్ విలన్ గా కనిపించబోతున్నాడని చెబుతున్నారు.
That Elevation In Phone Call Conversion Between Colonel Luthra, Kabir About @tarak9999 ??????#HrithikRoshan #JrNTR #SalmanKhan #ShahRukhKhan #Tiger3 #Tiger3Review #Tiger3Diwali2023 pic.twitter.com/xwqQnkf49F
— Rakesh.Jinkala (@Rockyj9999) November 12, 2023