Pawan Kalyan: చిరంజీవి, బాలయ్యలకు ‘వీర’ విజయం.. పవన్‌కి కూడా కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పోస్టర్స్‌తో చెప్పుకొచ్చింది.

Pawan Kalyan: చిరంజీవి, బాలయ్యలకు ‘వీర’ విజయం.. పవన్‌కి కూడా కలిసొస్తుందా..?

Will Veera Work Out For Pawan Kalyan In Hari Hara Veera Mallu

Updated On : January 23, 2023 / 8:50 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే పోస్టర్స్‌తో చెప్పుకొచ్చింది.

Pawan Kalyan Tour: జగిత్యాల జిల్లా‎లో జనసేనాని టూర్

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్ కూడా ఇప్పటికే రిలీజ్ కాగా, ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ప్రేక్షకులు పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలవడంతో ప్రేక్షకుల్లో పవన్ వీరమల్లు మూవీపై నమ్మకం మరింతగా పెరిగిపోయింది.

వీర అనే పదం చిరు, బాలయ్యలకు అదిరిపోయే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లులో కూడా అదే పదం ఉందని.. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక క్రిష్ తెరకెక్కించే సినిమాల్లో కంటెంట్‌పై నమ్మకం ఉన్నవారు, సినిమా టైటిల్‌తో సంబంధం లేకున్నా, ఖచ్చితంగా విజయం అందుకుంటుందని అంటున్నారు. ఏదేమైనా హరిహర వీరమల్లు సక్సెస్‌పై ప్రేక్షకులు ఓ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉన్నారని ఈ చర్చతో ప్రూవ్ అవుతోంది.