దేశంపై విరుచుకుపడుతున్న కరోనా.. ఒక్క రోజే రికార్డు స్థాయికి

ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడూ లేనంత స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
7వేల 529 కేసులు నమోదవగా 242 మృతులు రికార్డు అయి ఒక్కసారిగా షాక్ చేశాయి. శనివారం 1117కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పంజాబ్, ఒడిశా, మహారాష్ట్రలు లాక్ డౌన్ ఏప్రిల్ 30వరకూ పొడిగించేశాయి. ఇండియాలో తొలి కరోనా కేసు నమోదై సోమవారంతో ఐదు వారాలు పూర్తవుతుంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కీలకమైన జాగ్రత్తలు తీసుకుని తగు సహాయక చర్యలు తీసుకుంటూనే ఉంది.
మనకంటే అమెరికాలో మృతుల సంఖ్య భారీగానే పెరిగింది. ఒక్కరోజులోనే 2వేలకు చేరింది. ఈస్టర్ హాలిడే అయినప్పటికీ ఇళ్లలోనే ఉండిపోయారు దేశ ప్రజలంతా. శనివారం రెండోసారి సీఎంలతో వీడియో కాన్ఫిరెన్స్ లో మీటింగ్ అయిన మోడీ ఆదివారం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రులంతా లాక్ డౌన్ కోసం కేంద్రం ఫైనాన్షియల్ ప్యాకేజీ పెంచాలని కోరారు. పుదుచ్చేరి సీఎం వీ నారాయణస్వామి ముఖ్యమంత్రులంతా మోడీని కోరినట్లు వెల్లడించారు. వీడియో కాల్ తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించేశారు. వాటిలో పంజాబ్, ఒడిశాల తర్వాత ఢిల్లీ మూడోది.