ఐరన్ లోడు లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి

  • Published By: veegamteam ,Published On : August 23, 2019 / 06:31 AM IST
ఐరన్ లోడు లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి

Updated On : August 23, 2019 / 6:31 AM IST

రోడ్డు దాటుతున్న మూడు ఏనుగులు మృతి చెందాయి. ఒడిశాలోని కియెంఝర్ జిల్లాలో గురువారం (ఆగస్టు 22) తెల్లవారుఝామున లారీ ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని బలిజోడి ప్రాంతంలో నేషనల్ హైవే -20ని దాటుతున్న ఏనుగుల గుంపును ఇనుప ఖనిజం లోడు వెళ్తున్న లారీ 3 గంటల సమయంలో వేగంగా వెళ్తూన్న లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పదహారేండ్ల ఆడ ఏనుగు, ఏడాది వయసున్న ఏనుగు గున్న అక్కడికక్కడే చనిపోయాయి. తీవ్రంగా గాయపడిన మరో ఆడ ఏనుగు చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని ఘటగావ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ అశోక్‌కుమార్ నాయక్ తెలిపారు. కాగా తెల్లవారు ఝామున కావటంతో డ్రైవర్ కు రోడ్డు దాటుతున్న ఏనుగులు కనిపించకపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.