మిజోరాంలో భూకంపం

  • Published By: venkaiahnaidu ,Published On : November 14, 2020 / 05:05 PM IST
మిజోరాంలో భూకంపం

Updated On : November 14, 2020 / 5:53 PM IST

earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది.

శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు భాగంలో 119 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.



మిజోరం భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటన చేసింది.అయితే,భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని… నివాస ప్రాంతం కాని చోట ఈ భూకంపం సంభవిచిందని తెలిపారు.