మరింత పాజిటివ్‌గా ఉండడానికి 8 టిప్స్ మీ కోసం..

మరింత పాజిటివ్‌గా ఉండడానికి 8 టిప్స్ మీ కోసం..

Updated On : November 7, 2020 / 3:04 PM IST

Positive Thinking: అనుకున్నదానికంటే ఎక్కువ పాజిటివ్ గా అనిపించడానికి ఈ టెక్నిక్స్ వాడండి. అలసిపోయినట్లు అనిపించినా, ఒంటరిగా అనిపించినా, కాలం ఎప్పుడు కలిసొస్తుందా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటపడటం అంత సులువు కాకపోవచ్చు. ఈ క్రమంలో పాజిటివ్‌గా ఉండటం ద్వారా దాని నుంచి గట్టెక్కొచ్చు.

మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన సర్వేలో పాజిటివ్ థింకింగ్ అనేది జీవిత కాలాన్ని 15శాతం పెంచుతుందని బయటపడింది. ‘మన మెదళ్లు సగం ఖాళీ ఆక్యుపెన్సీతో ఉంటాయి. వాటి స్థానంలో కొత్త ఆలోచనలు నింపుకోవాలి’ అని హెల్త్ కోచ్ మిల్లా లాస్సెల్స్ అన్నారు. ఈ టిప్స్ ఫాలో అవ్వాలని అనుకుంటే మీ కోసం..



1. ప్రస్తుతంలో గడపండి
ఇది మనం ముందే విని ఉండొచ్చు. కానీ, అది చాలా ముఖ్యమైన పని. మనిషెక్కడో మనసెక్కడో అన్నట్లు ఉంటే ప్రశాంతతను పొందలేం. ‘చాలా మంది ఏవేవో ఆలోచిస్తూ సంతోషాన్ని తమ వంతుగా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రస్తుతంలో గడపకుండా వేరే ఆలోచనల్లో గడుపుతుంటే ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళమే అవుతుంది. దీని కోసం ఫోన్లలో రిమైండర్ పెట్టుకుని మనం చేసే పనిని పదేపదే గుర్తు చేసేలా ఉంచుకోవాలని చెప్తున్నారు మిల్లా లాస్సెల్స్. మనం ఏదైనా పనిచేసేటప్పుడు గట్టిగా శ్వాస పీల్చుకుని ఆలోచనలను గుర్తు చేసుకోవాలి.
https://10tv.in/virat-kohli-captains-should-have-option-of-reviewing-wide-ball-or-waist-high-full-toss/
2. మీరు ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి
ప్రతి రోజు ఉదయం మనం ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి. మూడు విషయాలపై ఫోకస్ చేసి ఉంచుకోవాలి. వ్యక్తి, ప్రశాంతత, ప్రామిస్. మనం అనుకున్నట్లుగానే ఇది చాలా సింపుల్. కానీ, ఇది మన మైండ్ సెట్ లో పాజిటివ్‌నెస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. ‘అది మనకు ఇన్‌స్టంట్ హ్యాపీనెస్, సంతోషం లాంటివి ఎమోషన్స్ ను స్విచ్‌లా మార్చుకోవచ్చు’

3. చుట్టూ పాజిటివ్ థింకర్స్ ఉండేలా
థింక్ లైక్ ఏ మాంక్ అనే అద్భుతమైన పుస్తకంలో జై శెట్టి అనే రచయిత ఇలా చెపపారు. నెగెటివ్ ఫ్రెండ్స్, నెగెటివ్ కొలీగ్స్ మీ మైండ్ సెట్ ను ఆక్యుపై చేసేయొచ్చు. నెగెటివిటీ అనేది అంత ఫోకస్డ్ గా ఉంటుంది. మీరు పాజిటివ్ గా ఉండాలంటే వీలైనంతగా సోషల్ మీడియా సైట్లకు దూరంగా ఉండండి. ఫలితంగా ఇతరుల నుంచి కంప్లైంట్లు మీకు రావు.

4. బయట తిరుగుతూ ఉండండి
మానసిక ఆరోగ్యం కోసం ప్రకృతి బాగా సహాయపడుతుంది. ఇటీవల స్టడీలోనూ అదే బయటపడింది. 50నిమిషాల పాటు సిటీ పార్క్ లో వాకింగ్ చేస్తే బెటర్ మెమోరీతో పాటు, చాలా మందిలో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంకొక 40నిమిషాలు బయటగడపడం వల్ల బ్రెయిన్ లో మార్పులు డిప్రెషన్ రాకుండా అడ్డుకున్నాయి. బయటతిరగడం వల్ల కార్టిసల్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. యాంగ్జైటీ, లో మూడ్స్, స్ట్రెస్ లాంటి వాటి నుంచి తక్కువగా ఇబ్బంది మాత్రమే అవుతుంది. రిలాక్స్‌డ్ లంచ్ టైం కూడా ఒక ట్రిక్కే.

5. పాజిటివ్ గా ఉన్నానని అనుకుంటూ ఉండండి
నెగెటివ్ అనుభవాలు మెదడును మైక్రో సెకన్ల గ్యాప్ లో అంటుకుపోతాయి. అదే పాజిటివ్ వైబ్రేషన్స్ మెదడులోకి చేరడానికి 20సెకన్ల సమయం పడుతుంది. జీవితంలో పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ అనేది 30సెకన్ల పాటు ఫోకస్ చేశాకే వస్తుంది.

6. మీ మైండ్‌ను శరీరాన్ని అదుపులో ఉంచుకోండి
వినడానికి సింపుల్‌గానే అనిపించినా ఇది కష్టం. కానీ, మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేసే క్షణాల కోసం వెచ్చించండి. 15నిమిషాల పాటు హోం ఫేషియల్ కు, ఫుల్ ఫేస్ మేకప్ లేదా ఇష్టమైన లంచ్ తయారుచేసుకోవడానికి వెచ్చించండి.

7. మీ విధానం మార్చుకోండి
పవర్ పోజ్ గురించి ఎప్పుడైనా విన్నారా.. శరీరంలో కొన్ని భంగిమలను బట్టి మనలో ఫీలింగ్స్ మారతాయనేది వాస్తవం. అలాగే పవర్ పోజ్ కూడా భుజాలు వెడల్పుగా తెరవండి. అలా చేయడం వల్ కాన్ఫిడెన్స్ లెవల్ పెరగడంతో పాటు కార్పిజోల్ లెవల్స్ 25శాతం తగ్గేలా చేస్తాయి. తక్షణం మానసికంగా మార్పు తీసుకురావడానికి ఇది బెస్ట్ టెక్నిక్.

8. ధ్యానం చేయం
ప్రతి రోజూ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనిషి మెదడు డిప్రెషన్ నుంచి బయటపడుతుంది. శారీరక బాధ, నెగెటివ్ థింకింగ్ మీద ఓ అభిప్రాయం కనిపిస్తుంది. కొన్ని యాప్ ల ద్వారా దీన్ని బెస్ట్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదంతగా పనిచేస్తుందని అనిపించకపోయినా అదొక మిరాకిల్ క్యూర్ కాకపోవచ్చు. కానీ, అది మన మూడు మారడానికి హెల్ప్ అవుతుంది. పైగా ఇది ఫ్రీ కూడా.