Viral Video : కుకింగ్ లెసన్స్‌తో ఇంటర్నెట్ మనసు దోచుకున్న 85 ఏళ్ల బామ్మ

మనసులో ఉత్సాహం.. ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని ఓ బామ్మగారిని చూస్తే అర్ధం అవుతుంది. సోషల్ మీడియాలో వంటలు చేస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఆ బామ్మ గురించి చదవండి.

Viral Video : కుకింగ్ లెసన్స్‌తో ఇంటర్నెట్ మనసు దోచుకున్న 85 ఏళ్ల బామ్మ

Viral Video

Updated On : November 30, 2023 / 6:44 PM IST

Viral Video : యూత్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో వృద్ధులు సైతం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆటలు, పాటలు, కబుర్లతో హోరెత్తిస్తున్నారు. 85 ఏళ్ల బామ్మగారు కుకింగ్ లెసన్స్ చెబుతూ ఇంటర్నెట్ మనసు దోచుకున్నారు.

Ashwin : న‌వంబ‌ర్ 19 చేదు జాప్ఞ‌కాలు గుర్తు చేసుకున్న అశ్విన్‌.. ఎలా చెప్పేది..!

శ్రీమతి విజయ్  నిశ్చల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. రకరకాల వంటలు చేసి చూపించడమే కాదు పాఠాలు కూడా చెబుతారు. 85 సంవత్సరాల వయసులో ‘దాదీ కి రసోయ్’ పేరుతో వంటల వీడియోలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిశ్చల్ కేవలం 90 సెకన్లలో వంటల వీడియోలు, పాఠాలు చెప్పేస్తారు. చాలా సులభంగా తయారు చేసుకునే వంటలు, చిట్కాలను పంచుకుంటూ ఉంటారు. మనకి ఇష్టమైన పనులు చేయడానికి వయసు అనేది అడ్డంకి కాదు అని నిశ్చల్ నిరూపిస్తున్నారు.

Lucknow : 2 భార్యలు, 9 పిల్లలు, 6 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్న ఆ సోషల్ మీడియా స్టార్‌ను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?

శ్రీమతి నిశ్చల్ తన తండ్రి దగ్గర నుంచి వంటలు వండటం నేర్చుకున్నారట. 85 సంవత్సరాల వయసులో మనవడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని సలహా ఇవ్వడంతో నిశ్చల్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 8,31,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. రీసెంట్‌గా నిశ్చల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (dadikirasoi01) ఎగ్‌లెస్ కేక్ తయారు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నిశ్చల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కూలెస్ట్ దాదీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  చిన్న వయసులోనే ఏం సాధించలేం అంటూ నిరాశపడేవారికి ఈ దాదీ నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by दादी ji की Rasoi ? (@dadikirasoi01)