Muslim Donate Land For Hindu Temple : వెల్లివిరిసిన మత సామరస్యం.. ఆలయ నిర్మాణానికి భూమిచ్చిన ముస్లిం
ఉత్తరప్రదేశ్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

hindu temple
Muslim Donate Land For Hindu Temple : ఉత్తరప్రదేశ్‌లో మత సామరస్యం వెల్లివిరిసింది. హిందూ దేవాలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ సంఘటన షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆంజనేయస్వామి ఆలయం అడ్డుగా ఉంది. దీంతో విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోంది.
Hanuman Jayanti: హనుమాన్ జయంతి.. వెల్లివిరిసిన మత సామరస్యం!
సమస్య ఎంతకు పరిష్కారం కాకపోవడం లేదు. దీనిపై కచియాని ఖేరా గ్రామానికి చెందిన బాబు అలీ స్పందించారు. ఆలయం కోసం తన భూమిలోని కొంత భాగాన్ని అధికారులకు ఇచ్చారు. తాను ఇచ్చిన స్థలంలోకి ఆంజనేయ ఆలయాన్ని మార్చాలని అధికారులకు సూచించారు.