బీజేపీలోకి 13మంది ఎమ్మెల్యేలు….మరో రాష్ట్రంలో కాంగ్రెస్ కు భారీ షాక్?

ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని,తర్వలో వాళ్లు చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ 13మంది ఎమ్మల్యేలు రాజ్యసభ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. తమకు ఫుల్ మెజార్టీ ఉందని ఓ వైపు గుజరాత్ బీజేపీ నాయకత్వం చెబుతూనే..మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకమాండ్ తో టచ్ లో ఉన్నారని,వారు పార్టీలోకి వస్తే తాము అభ్యంతరం చెప్పబోమని అంటున్నారు.
మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా…గుజరాత్ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించినట్లు కన్ఫర్మ్ చేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారని,ఒకవేళ బీజేపీ మిమ్మల్ని ప్రలోభపెట్టాలని ఎన్ని ప్రయత్నాలు వాటికి లొంగకుండా మీరు తప్పనిసరిగా కాంగ్రెస్ తో ఉండాలి అని ఆ మీటింగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం.
అయితే ఏ ఎన్నికలప్పుడైనా బీజేపీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తూనే ఉంటుందని,ఇది చాలా సాధారణం అని,కానీ ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో వారి దగ్గర ఎక్కువ సంఖ్యా బలం లేదని,ఎప్పటిలానే కాంగ్రెస్ కలిసికట్టుగా ఉంటుందని ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ తెలిపారు. అయితే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వేబేధాలు లేవని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పరేష్ దనాని తెలిపారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో బీజేపీకి ప్రస్తుతం 103మంది ఎమ్మెల్యేలు ఉండగా,కాంగ్రెస్ 73మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Leader of Opposition in Gujarat Assembly Paresh Dhanani: There is no dispute in Congress party in Gujarat. (File pic) pic.twitter.com/UrITRn1PpH
— ANI (@ANI) March 10, 2020
See Also | వైసీపీలో చేరనున్న టీడీపీ నేత రామసుబ్బారెడ్డి