Karnataka elections 2023: “విషసర్పం” వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం

Karnataka elections 2023: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రధాని మోదీని విషసర్పం అంటూ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది.

Karnataka elections 2023: “విషసర్పం” వ్యాఖ్యలపై అమిత్ షా ఆగ్రహం

Amit Shah(Photo : Google)

Updated On : April 28, 2023 / 9:39 PM IST

Karnataka elections 2023: ప్రధాని మోదీని విషసర్పం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah) కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతల మతిపోయిందని అన్నారు. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా, నవలగుండ్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రధాని మోదీని ప్రపంచం మొత్తం ఎంతో గౌరవభావంతో చూస్తోందని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. ప్రధాని మోదీపై అటువంటి వ్యాఖ్యలు ఎంతగా చేస్తే, ప్రజల నుంచి అంతగా మద్దతు పెరుగుతూనే ఉంటుందని అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ కు ఏమీ కనపడడం లేదని, గత తొమ్మిదేళ్లుగా ప్రధాని మోదీ భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచారని చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాలు పెంచారని, దేశ శ్రేయస్సు కోసం పాటుపడ్డారని అమిత్ షా చెప్పుకొచ్చారు. దేశ సరిహద్దుల్లో భద్రతను పెంచారని తెలిపారు. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా అక్కడి ప్రజలు మోదీ-మోదీ నినాదాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారని అన్నారు.

Karnataka elections 2023: “విషసర్పం” వివాదం ముగియకముందే ఇప్పుడు కొత్తగా “విషకన్య” వివాదం