CM Vijayan: కేరళతో సమస్యేంటో అమిత్ షా చెప్పాలి.. కేరళ సీఎం విజయన్ డిమాండ్

తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు. ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షాపై విమర్శలు చేశారు.

CM Vijayan: కేరళతో సమస్యేంటో అమిత్ షా చెప్పాలి.. కేరళ సీఎం విజయన్ డిమాండ్

Updated On : February 13, 2023 / 2:27 PM IST

CM Vijayan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలు చేశారు. తమ రాష్ట్రమైన కేరళతో అసలు సమస్యేంటో అమిత్ షా చెప్పాలని విజయన్ డిమాండ్ చేశారు. కేరళలో అన్ని వర్గాల ప్రజలు బాగానే ఉంటున్నారని, ఎవరితో, ఎవరికీ సమస్య లేదని విజయన్ అన్నారు.

Delhi: తల్లితోపాటు ఫ్యాక్టరీకి వెళ్లిన బాలుడు.. ఎలివేటర్ షాఫ్ట్‌లో చిక్కుకుని మృతి

ఆదివారం సీపీఎం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో విజయన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షాపై విమర్శలు చేశారు. అయితే, దీనికో కారణం ఉంది. ఇటీవల దక్షిణ కర్ణాటకలో పర్యటించిన అమిత్ షా కేరళ రాష్ట్రంపై విమర్శలు చేశారు. అక్కడ తీవ్రవాద అనుబంధ సంస్థ అయిన పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సభ్యులు భారీ స్థాయిలో పట్టుబడిన అంశాన్ని అమిత్ షా ప్రస్తావించారు. పరోక్షంగా తీవ్రవాదులకు కేరళ మద్దతు ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం విజయన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

LTTE Prabhakaran: ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. సంచలన ప్రకటన చేసిన నెడుమారన్

‘‘కేరళలో ఏ విషయం ప్రమాదకరంగా అనిపించిందో అమిత్ షా చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మైనారిటీలపై వేధింపులు ఎక్కువయ్యాయి. దాడులు జరుగుతున్నాయి. కానీ, కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో మాత్రం వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కేరళలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇక్కడ సమస్యేంటో అమిత్ షా చెప్పాలి. కర్ణాటకలో మైనారిటీలు దాడులకు గురవుతుంటే, కేరళలో మాత్రం క్షేమంగా ఉన్నారు. మత ఘర్షణలు సృష్టించాలన్న అమిత్ షా లక్ష్యం కేరళలో మాత్రమే నెరవేరడం లేదు.

WPL Auction 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల వేలం.. కోటి దాటే ఆటగాళ్లు వీళ్లేనా?

పొరుగునే ఉన్న కర్ణాటకలోని మంగళూరు, చిక్‌మగళూరులో సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. అక్కడ 150 ఏళ్ల చర్చిపై సంఘ్ పరివార్ కార్యకర్తలు 2021 క్రిస్మస్ సందర్భంగా దాడి చేశారు. కానీ, అలాంటి పరిస్థితి కేరళలో ఉందా?’’ అని విజయన్ వ్యాఖ్యానించారు.