Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు కేఫ్‌లో బాంబు పెట్టింది ఇతడే.. కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు!

Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన అనుమానితుడికి సంబంధించిన ఫొటోలను ఎన్ఐఏ విడుదల చేసింది. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి గుర్తించి పట్టించినవారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది.

Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు కేఫ్‌లో బాంబు పెట్టింది ఇతడే.. కొత్త ఫొటోలు రిలీజ్ చేసిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు!

Anti-Terror Agency Releases New Photos Of Bengaluru Cafe Blast Suspect

Bengaluru Cafe Blast Suspect : బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడుతో సంబంధం ఉన్న అనుమానితుడి కొత్త ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విడుదల చేసింది. మార్చి ఒకటిన ప్రముఖ బెంగళూరు కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని అమర్చినట్లు భావిస్తున్న నిందితుడిని గుర్తించడంలో ప్రజల సహాయాన్ని కోరింది. కేఫ్‌లో పేలుడు జరిగిన గంట తర్వాత ప్రధాన నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు నమోదైంది. కేఫ్‌లో పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది.

Read Also : అతడి ఆచూకీ చెబితే.. రివార్డుగా రూ.10 లక్షల క్యాష్

అనుమానితుడిని పట్టిస్తే.. రూ. 10లక్షల రివార్డు :
టీ-షర్ట్, క్యాప్, ఫేస్‌మాస్క్ ధరించిన నిందితుడు.. కేఫ్‌లో ఐఈడీ ఉన్న బ్యాగ్‌ను వదిలివేయడం కనిపించింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్నట్లు కనిపించింది. బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు ఘటనలో 10 మంది గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, మార్చి 3న ఈ కేసును టేకఫ్ చేసిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ.. అనుమానితుడిని గుర్తించి పట్టుకోవడానికి ఏదైనా సమాచారం దొరికితే వెంటనే తెలియజేయాలని ప్రజలను ఎన్ఐఏ కోరింది. అనుమానితుడి గురించి సమాచారం తెలియజేసినవారికి రూ. 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. అనుమానితుడి గురించి సమాచారం అందించేందుకు 08029510900, 8904241100 నెంబర్లకు లేదా info.blr.nia@gov.in ఇమెయిల్ చేయాల్సిందిగా ఎన్ఐఏ కోరింది. సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది.

గుర్తుపట్టకుండా ఉండేందుకు బట్టలు మారుస్తూ.. :
బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎన్ఐఏకి దర్యాప్తులో సహకరిస్తోంది. ఈ కేసుకు సంబంధించి బళ్లారి జిల్లాలోని కౌల్ బజార్‌కు చెందిన ఓ బట్టల వ్యాపారిని, నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కి సంబంధించిన క్యాడర్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తు బృందం ప్రకారం.. నిందితుడు సంఘటన తర్వాత బట్టలు మార్చుకున్నాడు. తుమకూరు, బళ్లారి, బీదర్, భత్కల్‌తో సహా వివిధ ప్రాంతాలకు బస్సులో ప్రయాణించాడు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు ఎవరు తనను గుర్తించకుండా తప్పించుకోవడానికి తరచుగా బట్టలు, వేషధారణ మార్చుకుంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మళ్లీ తెరుచుకున్న కేఫ్ :
రామేశ్వరం కేఫ్ మళ్లీ ఓపెన్ అయింది. పటిష్ట భద్రతా చర్యలతో శనివారం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించింది. ఎంట్రీ గేట్ వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. కేఫ్‌లోకి ప్రవేశించే కస్టమర్లు సహా ఇతర సిబ్బంది భద్రత కోసం హ్యాండ్‌హెల్డ్ డిటెక్టర్లను ఉపయోగించి స్క్రీనింగ్‌ చేస్తున్నారు. రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘మా భద్రతా బృందాన్ని బలోపేతం చేశాం. మా అన్ని బ్రాంచులలో మా సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇచ్చేందుకు మాజీ సైనికులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Read Also : Bengaluru Blast : రామేశ్వరం కేఫ్ బాంబు బ్లాస్ట్​ దర్యాప్తు ముమ్మరం.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తి గుర్తింపు